![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న 'హరి హర వీరమల్లు' ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఎప్పుడో ఐదేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా, పలు కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఈ చిత్రం జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా వీరమల్లు నుంచి థర్డ్ సింగిల్ గా 'అసుర హననం' పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా గ్రాండ్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం స్పీచ్ హైలెట్ గా నిలిచింది. (Hari Hara Veera Mallu)
ఖుషి, బంగారం తర్వాత పవన్ కళ్యాణ్ తో మూడో సినిమాగా మొదట 'సత్యాగ్రహి' అనుకొని, ఆ తర్వాత 'వేదాళం' రీమేక్ అనుకొని, చివరికి 'హరి హర వీరమల్లు' చేశామని ఎ.ఎం. రత్నం అన్నారు. "హరి హర వీరమల్లు సినిమా తయారవ్వడానికి ముఖ్యకారణం పవన్ కళ్యాణ్ గారు. ఖుషి, బంగారం తర్వాత పవన్ కళ్యాణ్ గారి డైరెక్షన్ లో సత్యాగ్రహి అనే సినిమా అనౌన్స్ చేశాము. పూజ కూడా చేశాము. సత్యాగ్రహి అంటే మనందరికీ తెలిసింది గాంధీ గారి సత్యాగ్రహం. కళ్యాణ్ గారు చెప్పాక నాకు అర్థమైంది సత్యాగ్రహి అంటే.. సత్య ఆగ్రహి. న్యాయం కోసం నేను చావడానికి కూడా సిద్ధం.. ఇంత పవర్ ఫుల్ గా ఉందని సినిమా ఓపెనింగ్ కూడా చేశాం. కానీ ఆయన డైరెక్షన్ చేయడం వీలుపడక ఆగింది. అందుకే రత్నం గారికి సినిమా చేయాలని ఆయన అనుకున్నారు. తమిళ సూపర్ హిట్ మూవీ 'వేదాళం'ని రీమేక్ చేద్దామనుకున్నాం. కానీ అది ఎలెక్షన్ వచ్చి చేయలేదు. తర్వాత క్రిష్ గారు ఒకసారి ఫోన్ చేసి ఈ లైన్ చెప్పారు.. నాకు నచ్చింది. పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు తీసుకెళ్లి చెప్తే.. నేను రత్నం గారి జడ్జిమెంట్ ను నమ్మి ఈ సినిమా చేస్తానన్నారు." అని రత్నం చెప్పుకొచ్చారు.
![]() |
![]() |