![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రాబోతుంది. చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తున్న 'హరి హర వీరమల్లు' షూటింగ్ ఇటీవల పూర్తయిన సంగతి తెలిసిందే. జూన్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. త్వరలో ట్రైలర్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ కట్ పూర్తయిందని, అవుట్ పుట్ అదిరిపోయిందని వినికిడి. (Hari Hara Veera Mallu)
పవన్ కళ్యాణ్ సినిమా అంటే తెలుగునాట ఏ స్థాయి హడావుడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే పవన్ రాజకీయాలతో బిజీ కావడంతో సినిమాలకు తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు. అందుకే వీరమల్లు బాగా ఆలస్యమైంది. అయినప్పటికీ ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటిదాకా విడుదలైన ప్రచార చిత్రాలు మెప్పించాయి. ఇక త్వరలో విడుదల కానున్న ట్రైలర్ తో వీరమల్లుపై అంచనాలు మరో స్థాయికి వెళ్లడం ఖాయమని చెబుతున్నారు. ట్రైలర్ కట్ ఓ రేంజ్ లో ఉందని, ఈమధ్య కాలంలో ఇదే బెస్ట్ ట్రైలర్ కట్ అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ గా రూపుదిద్దుకుంటున్న వీరమల్లు నుంచి ట్రైలర్ విడుదలైతే.. పాన్ ఇండియా వైడ్ గా సౌండ్ చేయడం ఖాయమని అంటున్నారు.
![]() |
![]() |