Home

»

Latest News

అడ్వాన్స్ వెర్షన్ వెనకున్న కథ ఏంటి బాలయ్య!

May 13, 2025 3:05PM

గాడ్ ఆఫ్ మాసెస్, పద్మభూషణ్ బాలకృష్ణ (Balakrishna)హిట్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను(Boyapati Srinu)కాంబోకి ఉన్నక్రేజ్ గురించి తెలిసిందే. ఆ ఇద్దరి కాంబోలో సినిమా వస్తే సరికొత్త కథా ప్రభంజనానికి నాంది పలుకుతారనే నానుడి అభిమానుల్లో ప్రేక్షకుల్లో ఏర్పడింది. సింహ,లెజండ్, అఖండ వంటి హ్యాట్రిక్ హిట్స్ నే అందుకు ఉదాహరణ. ఈ మూడు చిత్రాల్లోని  పోరాట సన్నివేశాలు ఒక రేంజ్ లో ఉండటమే కాకుండా, ఆయా సన్నివేశాలలో బాలయ్య వాడే ఆయుధాలు సరికొత్తగా ఉండి ప్రేక్షకులని ఉర్రుతలూగిస్తుంటాయి.


ఈ కోవలోనే అప్ కమింగ్ మూవీ అఖండ 2(Akhanda 2)లో బాలయ్య కోసం బోయపాటి స్పెషల్ గా ఒక ఆయుధాన్ని డిజైన్ చేయించాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి భాగంలో బాలయ్య త్రిశూలం చేతబూని ఒక రణరంగాన్నే సృష్టించాడు. దీంతో పార్ట్  2 లో మళ్ళీ త్రిశూలం అయితే బాగోదని, దానికి అడ్వాన్స్ వెర్షన్ గా ఒక సరికొత్త ఆయుధాన్ని బాలయ్య  ఉపయోగించబోతున్నట్టుగా తెలుస్తుంది. సదరు ఆయుధంతో బాలకృష్ణ చేసే శత్రు సంహారం తెలుగు చలనచిత్ర చరిత్రలో నిలబడిపోయే విధంగా ఉంటుందని కూడా అంటున్నారు. మరి ఆయుధం  గురించి మేకర్స్ అధికారంగా ప్రకటిస్తారేమో చూడాలి. సోషల్ మీడియాలో వస్తున్న ఈ న్యూస్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా, సదరు ఆయుధం ఏమయ్యి ఉంటుందని చర్చించుకుంటున్నారు.
 
ఇక అఖండ 2 షూటింగ్ దశలో ఉండగా ఇప్పటికే కొంత భాగాన్ని పూర్తి చేసుకుంది. ఇటీవలే హిమాలయాల్లో కొన్ని కీలక సన్నివేశాలని తెరేక్కించారు. బాలకృష్ణ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మాణం జరుపుకుంటున్న ఈ మూవీని, ఫోర్టీన్ రీల్స్ తో కలిసి బాలకృష్ణ చిన్న కూతురు తేజశ్వని నిర్మిస్తుంది. ప్రగ్య జైస్వాల్(Pragya Jaiswal)సంయుక్త మీనన్(samyutha menon)  హీరోయిన్లుగా చేస్తుండగా థమన్(Thaman)మ్యూజిక్ ని అందిస్తున్నాడు. విజయదశమి(Vijayadasami)సందర్భంగా సెప్టెంబర్ 25 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com