Home

»

Latest News

అక్కడ అమ్మాయి,ఇక్కడ అబ్బాయి ఓటిటి డేట్ ఇదే 

May 8, 2025 10:52AM

ప్రముఖ యాంకర్, సినీ హీరో 'ప్రదీప్ మాచిరాజు'(Pradeep Machiraju)ఏప్రిల్ 11 న 'అక్కడ అమ్మాయి,ఇక్కడ అబ్బాయి'(Akkad Ammayi Ikkada Abbayi)  మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా  ప్రదీప్ కెరియర్ లో మంచి వసూలన్నీ రాబట్టింది. 'దీపికా పిల్లి'(Deepika Pilli) హీరోయిన్ గా చెయ్యగా వెన్నెల కిషోర్, సత్య, మురళీధర్ గౌడ్, జీ ఎం సుందర్, జాన్ విజయ్, గెటప్ శ్రీను తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.


ఇప్పుడు ఈ మూవీ ఓటిటి వేదికగా 'ఈటివి విన్ ' లో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఓటిటి సినీప్రియులకి కావాల్సినంత సినీ వినోదం అందనుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు  సరిహద్దుల్లో  'భైరికోన' అనే ఊరు ఉంటుంది. ఆ ఊరిలో అందరు మగవాళ్లే ఉంటారు.

 అలాంటి ఆ ఊర్లో చాలా సంవత్సరాలకి ఒక ఆడపిల్ల పుడుతుంది. ఆమె పుట్టడంవలన వర్షాలు పడి ఆ ఊరికి ఎప్పట్నుంచో ఉన్న కరువు దూరం అవుతుంది. దీంతో అందరు 'మహాలక్ష్మీ' పుట్టిందని భావించి  ఆమెని ఊరు   దాటనివ్వవారు. ఆ ఊరిలోని మగవాళ్లే ఆమెని పెళ్లి చేసుకోవాలని ఊరి పెద్ద చెప్తాడు.

దాంతో ఆ ఊర్లోకి బయట మగవాళ్లని రానివ్వరు.కానీ  కృష్ణ అతని స్నేహితుడు ఆ ఊరు వస్తారు. కృష్ణ, మహాలక్ష్మి కి పరిచయం జరిగి వాళ్ళ మధ్య ప్రేమ పుడుతుంది. మరి వాళ్ల ప్రేమ గెలిచిందా లేదా అనేదే ఈ చిత్ర కథ. మాంక్స్ అండ్ మంకీస్ ఈ చిత్రాన్ని నిర్మించగా నితిన్, భరత్ ద్వయం దర్శకత్వం వహించింది.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com