![]() |
![]() |

ఘట్టమనేని కుటుంబం నుంచి మూడో తరం రాబోతుంది. సూపర్ స్టార్ కృష్ణ లెజెండ్ గా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు. మహేష్ బాబు కూడా తండ్రికి తగ్గ తనయుడిగా బిగ్ స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు ఆ కుటుంబం నుంచి వారసుడు రాబోతున్నాడు. కృష్ణ మనవడు, రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.
కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు పలు సినిమాల్లో నటించారు కానీ, స్టార్ గా ఎదగలేకపోయారు. నిర్మాతగా బాగానే రాణించారు. 2022 లో రమేష్ అనారోగ్యంతో మరణించారు. ఇప్పుడు ఆయన కుమారుడు జయకృష్ణ సినీ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైంది.
జయకృష్ణ మొదటి సినిమాకి అజయ్ భూపతి దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది. 'ఆర్ఎక్స్ 100', 'మంగళవారం' సినిమాలతో దర్శకుడిగా అజయ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు జయకృష్ణ కోసం అదిరిపోయే కథను సిద్ధం చేసినట్లు సమాచారం.
ఇక ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనీదత్ నిర్మించనున్నారట. మహేష్ మొదటి చిత్రం 'రాజకుమారుడు' కూడా వైజయంతి బ్యానర్ లోనే రూపొందడం విశేషం. మరి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి.. బాబాయ్ మహేష్ లాగానే అబ్బాయ్ జయకృష్ణ కూడా స్టార్ గా ఎదుగుతాడేమో చూడాలి.
![]() |
![]() |