Home

»

Latest News

నాని పోరాటం స్టార్ట్..అభిమానులు వెయిటింగ్ 

May 6, 2025 10:36AM

నాచురల్ స్టార్ 'నాని'(Nani)రీసెంట్ గా 'హిట్ 3(Hit 3)తో మరో భారీ విజయాన్ని అందుకున్నాడు.ఇప్పటికే వంద కోట్ల క్లబ్ లో చేరిన హిట్ 3 మరిన్ని కలెక్షన్స్ ని రాబట్టే దిశగా దూసుకెళ్తుంది. ఓవర్ సీస్ లో కూడా ఇప్పటికే  2  మిలియన్ డాలర్ల క్లబ్ లోకి చేరి సరికొత్త రికార్డులు సృష్టించింది. రీసెంట్ గా నాని యుఎస్ వెళ్లి అక్కడి ప్రేక్షకులకి తన అభినందనలు చెప్పడమే కాకుండా వాళ్ళతో కలిసి మూవీని వీక్షించాడు. 

ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో తన అప్ కమింగ్ మూవీ 'ది ప్యారడైజ్'(The Paradise)కోసం సిద్ధమవుతున్నాడు. గుర్తింపు కోసం పోరాడే ఒక జాతి కథతో పూర్తి రా రస్టిక్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. మే 18 నుంచి నాని ఈ చిత్రం యొక్క షూటింగ్ లో జాయిన్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ లో 1980 వ వాతావరణాన్ని తలపించేలా ఒక భారీ సెట్ ని సిద్ధం చేసారని, అందులో నానిపై ఒక భారీ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఇక ఇప్పటికే రిలీజైన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఒక కొత్త నానిని చూడబోతున్నామని అభిమానులతో పాటు ప్రేక్షకులు మూవీ కోసం ఇప్పట్నుంచే వెయిట్ చేస్తున్నారు.
నాని కెరీర్ లో వన్ ఆఫ్ ది హిట్ గా నిలిచిన దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela)ఈ చిత్రానికి దర్శకుడు కాగా సుధాకర్ చెరుకూరి(Sudhakar Cherukuri) నిర్మిస్తున్నాడు. 2026 మార్చి 26 న  విడుదల కాబోతుంది. మూవీకి సంబంధించిన మిగతా నటీనటుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com