![]() |
![]() |

భారతీయ చిత్రాలు కొంత కాలం నుంచి ఓవర్ సీస్ లో ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర అమెరికా(North America)లో అయితే తమ హవాని కొనసాగిస్తు భారీ కలెక్షన్స్ ని రాబడుతున్నాయి. మన తెలుగు సినిమా కూడా మిగతా అన్ని భాషలకి ధీటుగా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతూ ఓవర్ సీస్ ప్రేక్షకులని విశేషంగా ఆకర్షిస్తుంది. రీసెంట్ గా నాచురల్ స్టార్ నాని(Nani)వన్ మాన్ షో హిట్ 3(Hit 3) ఎవరు ఊహించని విధంగా ఇప్పటికే 2 మిలియన్ల డాలర్స్ ని సాధించి చరిత్ర సృష్టించింది. దీన్ని బట్టి మన సినిమా యుఎస్(Us)లో ఎంతగా కలక్షన్స్ ని వసూళ్లు చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు.
రీసెంట్ గా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump)సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ లో మాట్లాడుతు విదేశాల్లో నిర్మాణం జరుపుకొని అమెరికాలో విడుదలయ్యే అన్ని చిత్రాలపై వంద శాతం సుంకం విధించే అధికారాన్ని వాణిజ్య శాఖకి అప్పగించానని చెప్పాడు. దీంతో ట్రంప్ చెప్పిన ఈ మాటతో భారతీయ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కి గురయ్యింది. అమెరికన్ సినీ మార్కెట్ లో 30 నుంచి 40 శాతం వాటా భారతీయ సినిమాలదే.
అందులోను తెలుగు సినిమా వాటా ఇటీవల ఘనంగా పెరిగింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న బడా హీరోల చిత్రాలన్నీ యుఎస్ ప్రేక్షకులని ఆకర్షించడానికి బడ్జెట్ పరంగా, క్వాలిటీ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ కావడం లేదు. ఆర్టిస్టుల దగ్గర్నుంచి, టెక్నీషియన్స్ దాకా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన వాళ్ళని భారీ రెమ్యునరేషన్స్ ఇచ్చి తమ సినిమాలో ఫిక్స్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ట్రంప్ నిర్ణయం అధికారంగా అమలు అయితే నిర్మాతలకి నష్టం చేకూర్చే అవకాశం ఉందని పలువురు సినీ ప్రముఖులు చెప్తున్నారు.
![]() |
![]() |