![]() |
![]() |

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తుండటంతో.. సినిమాలకు సమయం కేటాయించలేకపోతున్నారు. దీంతో గతంలో కమిటైన సినిమాలు ఆలస్యమవుతూ వస్తున్నాయి. పవన్ కొత్త సినిమా విడుదలైతే చూడాలని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే త్వరలోనే వారి ఆశ నెరవేరేలా ఉంది.
ప్రస్తుతం పవన్ చేతిలో 'హరి హర వీరమల్లు', 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్' వంటి సినిమాలు ఉన్నాయి. 'హరి హర వీరమల్లు' షూటింగ్ దాదాపు పూర్తయింది. పవన్ మరో నాలుగైదు రోజులు డేట్స్ కేటాయిస్తే సరిపోతుందని సమాచారం. వీరమల్లు ఇప్పటికే పలుసార్లు వాయిదా పడింది. మే 9న ఖచ్చితంగా విడుదలవుతుంది అనుకుంటే మళ్ళీ వాయిదా పడింది. దానికి కారణం పవన్ బ్యాలెన్స్ షూట్ ని పూర్తి చేయలేకపోవడమే. నిజానికి పవన్ ఏప్రిల్ లో షూటింగ్ లో పాల్గొనాలని భావించారు. కానీ, ఆయన తనయుడు మార్క్ శంకర్ సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడటంతో డేట్స్ కేటాయించలేకపోయారు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఆయన వీరమల్లు కోసం రంగంలోకి దిగారు. హైదరాబాద్ లో వేసిన ఒక భారీ సెట్ లో ప్రస్తుతం వీరమల్లు చిత్రీకరణ జరుగుతోందని, ఈరోజు షూటింగ్ లో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారని సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే, జూన్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.
'హరి హర వీరమల్లు' పూర్తయిన తర్వాత 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలను పూర్తి చేస్తానని నిర్మాతలకు పవన్ మాట ఇచ్చారట. ఆ రెండు సినిమాలు షూటింగ్ కూడా ఈ ఏడాది పూర్తయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. వీటి తర్వాత పవన్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి, తన పూర్తి ఫోకస్ ని పాలిటిక్స్ పైనే పెట్టే అవకాశాలున్నాయి.
![]() |
![]() |