![]() |
![]() |

సూర్య(Suriya)ప్రస్తుతం 'రెట్రో'(Retro)మూవీతో థియేటర్స్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 26 న జరగగా విజయ్ దేవరకొండ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. అందులో ఆయన షెడ్యూల్ తెగ కి సంబంధించి ఉపయోగించే 'ట్రైబల్'(tribal)అనే మాట మాట్లాడటం జరిగింది. విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు ఆదివాసులను అవమానించేలా ఉన్నాయని ట్రైబల్స్ లాయర్స్ అసోసియేషన్ హైదరాబాద్ లోని ఒక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తమ ఫిర్యాదులో విజయ్ గిరిజనులను అవమానించేలా మాట్లాడడం దారుణమని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ వివాదంపై విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)ట్వీట్ చేస్తు షెడ్యూల్డ్ తెగల వారిని ఎంతో గౌరవిస్తు, వారిని దేశంలో అంతర్భాగంగా భావిస్తాను. వారిని బాధపెట్టే లేదా లక్ష్యంగా చేసుకునే ఉద్దేశం ఏమాత్రం లేదు. దేశం ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చే సమయంలో, తన సోదరుల వలె భావించే భారతీయులలో ఏ ఒక్క వర్గాన్ని కూడా తాను ఉద్దేశపూర్వకంగా ఎలా వేరు చేస్తాను. నేను ఉపయోగించిన “ట్రైబ్” అనే పదం శతాబ్దాల క్రితం ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజం తెగలు, కుటుంబాలుగా ఏర్పడి, తరచుగా సంఘర్షణలు పడే కాలాన్ని సూచించే ఉద్దేశంతోనే ఉపయోగించాను. వలస వచ్చిన లేదా స్వాతంత్య్రానంతర భారతదేశంలో 100 సంవత్సరాల క్రితమే అధికారికంగా ఏర్పడిన షెడ్యూల్డ్ తెగల వర్గీకరణను ఉద్దెశించి చేసిన వ్యాఖ్యలు మాత్రం కాదు.
ఆంగ్ల డిక్షనరీ ప్రకారం ట్రైబల్ అంటే సామాజిక, ఆర్థిక, మతపరమైన లేదా రక్త సంబంధాలతో ముడిపడి, ఉమ్మడి సంస్కృతి మరియు మాండలికం కలిగిన కుటుంబాలు లేదా సమాజాల సమూహం. ఇది సాంప్రదాయ సమాజంలో ఒక సామాజిక విభాగం. నా సందేశంలో ఏదైనా భాగం అపార్థం చేసుకున్నా లేదా ఎవరినైనా బాధించి ఉన్నా, క్షమాపణలు తెలుపుతున్నానని విజయ్ దేవరకొండ ట్వీట్ లో తెలిపాడు.
![]() |
![]() |