![]() |
![]() |

డ్యాన్సర్ జాను గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. యూట్యూబ్ లో ఫోక్ సాంగ్స్ తో సత్తా చాటింది. అలాగే టీవీ షోలలోనూ డ్యాన్సర్ గా తనదైన ముద్ర వేసింది. సోషల్ మీడియాలో కూడా ఆమెకు ఎంతో ఫాలోయింగ్ ఉంది. డ్యాన్సర్ జాను తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. కొందరు ఆమె డ్యాన్స్ పై మీమ్స్, ట్రోల్స్ చేస్తుంటారు. కొందరైతే పర్సనల్ విషయాలపై కూడా కామెంట్స్ చేస్తుంటారు.
తాజాగా జాను రెండో పెళ్లి చేసుకుందంటూ కొన్ని ఫేక్ ఫొటోలు వైరల్ అయ్యాయి. దీనిపై ఆమె సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ గా స్పందించింది. "నా తల్లిదండ్రులు ఒక్క మాట కూడా అనకుండా ఎంతో ప్రేమగా పెంచారు. అలాంటిది ఇప్పుడు అడ్డమైనవాళ్లు నన్ను మాటలతో హింసిస్తున్నారు. జాను అలా, జాను ఇలా అంటూ మాట్లాడుతున్నారు. అసలు నా పర్సనల్ విషయాల గురించి మీకెందుకు. మీ లైఫ్ మీరు చూసుకోండి. నేను బ్రదర్ లా చూసేవాళ్ళతో కూడా లింక్ లు పెడుతున్నారు. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయకండి. ఈ బాధ తట్టుకోలేక చనిపోతానేమో అనిపిస్తుంది. ఒకరిని బాధపెట్టి మీరు బాగుండాలి అనుకోవడం తప్పు. సోషల్ మీడియా వాళ్ళు, మీడియా వాళ్ళు దయచేసి ఇలాంటి మాటలతో బాధపెట్టకండి." అంటూ కంటతడి పెట్టుకుంది జాను.
![]() |
![]() |