![]() |
![]() |

ప్రముఖ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram)ఎన్నో సినిమాల పరాజయాల తర్వాత 'క'(Ka)మూవీతో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది అక్టోబర్ 31 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 53 కోట్ల రూపాయలు సాధించి కిరణ్ అబ్బవరం కెరీర్లో హయ్యస్ట్ గ్రాస్ కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచింది.
ఢిల్లీలో ఏప్రిల్ 30 న నిర్వహించిన 'దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్'లో(dada saheb phalke film festival)ఉత్తమ చిత్రంగా' క' మూవీ నిలిచింది. దీంతో పలువురు నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా కిరణ్ అబ్బవరంతో పాటు టీంకి శుభాకాంక్షలు చెప్తున్నారు. 'దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్' అనేది ఒక చలనచిత్ర పండుగ. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 30 న, దాదాసాహెబ్ ఫాల్కే పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుక జరుగుతుంది. 2011లో ఢిల్లీ NCRలో ఔత్సాహిక, యువ, స్వతంత్ర, వృత్తిపరమైన చిత్రనిర్మాతలని ప్రొత్సహించడానికే ఈ ఫెస్టివల్ ని ఏర్పాటుచేశారు. ఇది ఒక ప్రభుత్వేతర, లాభాపేక్ష లేని, వాణిజ్యేతర మరియు స్వతంత్ర చలనచిత్రోత్సవం. కేంద్ర ప్రభుత్వం అందించే 'దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్' ఇప్పుడు 'క' మూవీ అందుకున్న అవార్డు కిందకి రాదు.
ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కిన' క' చిత్రం పూర్వ జన్మల కర్మల నేపథ్యంలో ఎవరెవరు ఎవరి కడుపున పుట్టాలి, ఎవరితో కలిసి తల్లి గర్భాన్ని పంచుకొని ఈ భూమ్మీదకి వస్తామో అనే పాయింట్ తో తెరకెక్కింది. కిరణ్ అబ్బవరం సరసన నయన్ సారిక(Nayan Sarika)జత కట్టగా తన్విరామ్, శరణ్య ప్రదీప్, రేడిన్ కింగ్ స్లే, అచ్యుత్ కుమార్, అజయ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. సుజిత్, సందీప్ కలిసి దర్శకత్వం వహించగా శ్రీ చక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ పై చింతా గోపాల కృష్ణారెడ్డి నిర్మించాడు.
![]() |
![]() |