![]() |
![]() |
అల్లు అర్జున్ కాంపౌండ్‌లో బన్నీ వాసు కీలకమైన వ్యక్తి అనే విషయం అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్‌కి సంబంధించిన అన్ని విషయాల్లోనూ కేర్ తీసుకుంటూ బన్నీ వాసుగా స్థిరపడ్డాడు. ఇక నిర్మాతగా ఎన్నో విజయాలు సాధించాడు. మంచి కాన్సెప్ట్‌తో సినిమాలు నిర్మిస్తూ నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నాడు. నిర్మాతగానే కాకుండా గోదావరి జిల్లాలో జనసేన పార్టీలో కీలక నేతగా ఉన్నారు. ఇటీవల నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నిర్మించిన ‘తండేల్’ చిత్రం సూపర్‌హిట్ అయి 100 కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో తండేల్ చిత్రం పైరసీపై మీడియాలో తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాజాగా ఓ ట్వీట్‌తో మరోసారి వార్తల్లోకి వచ్చారు వాసు. ‘ఒక విషయం మీద గట్టిగా రియాక్ట్ అవ్వాలని ఉంది.. అలాగే ఎందుకిప్పుడు గొడవలు అని కూడా ఉంది.. శాంతి.. శాంతి.. శాంతి’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. దీన్ని అందరూ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. బన్నీవాసు పెట్టిన ట్వీట్‌పై మరో నిర్మాత ఎస్‌కెఎన్ సోషల్ మీడియా ద్వారానే స్పందిస్తూ ‘అవ్వాలి అనిపిస్తే అయిపోవడమే.. తర్వాత సంగతి తర్వాత’ అంటూ ట్వీట్ చేశాడు.
అసలు బన్నీ వాసు అలా ఎందుకు ట్వీట్ చేశాడు. దానికి ఎస్‌కెఎన్ ఎందుకలా స్పందించాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బన్నీవాసు ఎవరిని ఉద్దేశించి అలా ట్వీట్ చేశాడు అని ఇండస్ట్రీలోని కొందరు టెన్షన్ పడుతున్నారు. అతను ఏ విషయం మీద గట్టిగా మాట్లాడాలి అనుకుంటున్నాడనేది ఎవరికీ అర్థం కావడం లేదు. ఇండస్ట్రీలోని ఒక ఫ్యామిలీ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాడా అనే సందేహం చాలా మందిలో వ్యక్తమవుతోంది. కొన్ని వివాదాస్పద అంశాలకు దూరంగానే ఉండే వాసు.. ఇలాంటి ట్వీట్ చేయడం వెనుక కారణం ఏమిటి అనేది తెలుసుకోవాలని అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే కొంతకాలం వెయిట్ చెయ్యక తప్పదు.
![]() |
![]() |