![]() |
![]() |

"కళాకారులు సున్నిత మనస్కులు" అని అంటుంటారు. ప్రముఖ హీరోయిన్ శృతి హాసన్ ని చూస్తే, ఆ మాట నిజమే అనిపిస్తోంది. లేకపోతే చిన్న విషయానికి చిన్న పిల్లలా కంటతడి పెట్టుకోవడం ఏంటి?. ఆమె కన్నీళ్లు పెట్టుకున్న వీడియో చూస్తే శృతి మరీ ఇంత సున్నితమా? అనిపించక మానదు. (Shruti Haasan)
ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐదుసార్లు విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్.. ఈ సీజన్ లో మాత్రం చతికిల పడింది. పాయింట్స్ టేబుల్ లో లాస్ట్ లో ఉంది. శుక్రవారం చెన్నై, హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో అయినా గెలిచి సీఎస్కే కమ్ బ్యాక్ ఇస్తుందనుకుంటే, మరో ఓటమిని ఖాతాలో వేసుకుంది. అయితే ఈ మ్యాచ్ ను చూడటానికి వెళ్ళిన శృతి హాసన్.. తన హోమ్ టీం చెన్నై ఓడిపోవడంతో కంటతడి పెట్టుకుంది. చిన్న పిల్లలా ఏడుస్తూ కనిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో "శృతి మరీ ఇంత సెన్సిటివ్ ఆ?" అంటూ నెటిజెన్లు కామెంట్స్ పెడుతున్నారు.
![]() |
![]() |