![]() |
![]() |

నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram)విజయశాంతి(vijayashanti)తల్లి కొడుకులుగా చేసిన మూవీ 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి(Arjun Son of vyjayanthi).నిన్న వరల్డ్ వైడ్ గా కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యధిక థియేటర్స్ లో విడుదలయ్యింది. రాజా చెయ్యి వేస్తే ఫేమ్ ప్రదీప్ చిలుకూరి(Pradeep Chilukuri)దర్శకుడిగా వ్యవహరించగా ఎన్టీఆర్ ఆర్ట్స్ ,అశోక క్రియేషన్స్ పై కళ్యాణ్ రామ్, అశోక్ వర్ధన్, సునీల్ నిర్మించారు. సయీ మంజ్రేకర్, శ్రీకాంత్, పృథ్వీ, సోహైల్ ఖాన్, ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించారు.
ఈ మూవీ మొదటి రోజు 5 .15 కోట్లరూపాయల రికార్డు కలెక్షన్స్ ని రాబట్టింది. కళ్యాణ్ రామ్ కెరీర్ లో తొలి రోజు కలెక్షన్స్ పరంగా చూసుకుంటే, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సెకండ్ హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా చెప్పవచ్చు. బింబిసార 6 .3 కోట్లు సాధించి ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ఈ మూవీ తర్వాత వచ్చిన డెవిల్, అమిగోస్ తొలి రోజు 5 కోట్లు కూడా దాటలేదు. కానీ 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఆ రెండిటిని క్రాస్ చెయ్యడం విశేషం.
రీసెంట్ గా మూవీ టీం సక్సెస్ మీట్ ని నిర్వహించింది. ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతు మా మూవీకి ఘన విజయాన్ని అందించిన నందమూరి అభిమానులకి, ప్రేక్షకులకి థాంక్స్. మంచి సినిమాతో వస్తే మీ వెనకే ఉంటామని తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. మంగళవారం, బుధవారానికి బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్తున్నారు. తల్లి కొడుకుల సీన్స్ తో పాటు చివరి ఇరవై నిమిషాల సీన్స్ మూవీకి ప్లస్ గా నిలిచాయని చాలా మంది చెప్తున్నారు. ఇంతమంచి కథ ని అందించిన దర్శకుడు ప్రదీప్ కి థాంక్స్ అని చెప్పాడు.
.webp)
![]() |
![]() |