![]() |
![]() |

మరాఠా యోధుడు 'ఛత్రపతి శివాజీ మహారాజ్'(Chhatrapati Shivaji maharaj)తనయుడు 'శంభాజీ మహారాజ్'(Sambhaji Maharaj)జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'చావా'(Chhaava). విక్కీ కౌశల్(vicky kaushal)టైటిల్ రోల్ పోషించగా రష్మిక, వినోద్ ఖన్నా ప్రధాన పాత్రల్లో కనపడ్డారు. హిందీలో ఫిబ్రవరి 14 ,తెలుగులో మార్చి 7 న రిలీజై రెండు చోట్ల మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా సుమారు 789 కోట్ల రూపాయలని సాధించింది. ఇక నాచురల్ స్టార్ నాని(Nani)నిర్మాతగా వచ్చిన మూవీ కోర్ట్'(Court). ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో కనిపించగా, మార్చి 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద 66 కోట్లకి పైగా కలెక్షన్స్ ని రాబట్టి తన సత్తా చాటింది.
'చావా' హిందీతో పాటు తెలుగులో ఈ నెల 11 న ఓటిటి వేదికగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. కోర్ట్ మూవీ కూడా ఇదే రోజున నెట్ ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఈ రెండు చిత్రాలు రికార్డు వ్యూస్ ని అందుకొని ఓటిటి చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించడానికి సిద్ధమవుతున్నాయి. చావా 5 .9 మిలియన్ గంటల్లో 2 .2 మిలియన్ల వ్యూస్ ని రాబట్టగా, కోర్ట్ 5 .4 మిలియన్ గంటల్లో 2 .2 మిలియన్ల వ్యూస్ ని దక్కించుకుంది. దీంతో చావా టాప్ 4 లో కొనసాగుతుండగా, కోర్ట్ టాప్ 5 లో కొనసాగుతుంది.
దీంతో ఈ రెండు చిత్రాల కథా నేపథ్యం వేరైనా, ఓటిటి లో పోటీ పోటీగా దూసుకెళ్తుండటం సినీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. చావా హిందీ వెర్షన్ కూడా ఏప్రిల్ 11 నే ఓటిటిలో అడుగుపెట్టగా రికార్డు వ్యూస్ తో ముందుకు దూసుకుపోతుంది. నెట్ ఫ్లిక్స్ నుంచి త్వరలోనే ఈ రికార్డు పై అధికార ప్రకటన రానుంది.
![]() |
![]() |