![]() |
![]() |
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఎఐ) అన్ని రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సినిమా రంగానికి ఈ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రముఖ టాలీవుడ్ నిర్మాత మంగళవారం తమ సంస్థ ట్విట్టర్ ఖాతాలో ‘బోల్డ్.. బిగ్ బియాండ్ ఇమాజినేషన్’ అంటూ ఓ పోస్ట్ పెట్టారు. బుధవారం ఉదయం 11.08 గంటలకు దానికి సంబంధించిన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఎఐలో విశేష కృషి చేస్తున్న ‘క్వాంటమ్ ఎఐ గ్లోబల్’తో కలిసి ఒక ఎఐ స్టూడియోను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ. ఎంటర్‌టైన్‌మెంట్ రంగం కోసం ఎఐ టూల్స్‌ను అభివృద్ధి చేసేందుకు, దానికి సంబంధించిన కంటెంట్‌ను అందించడానికి తమ స్టూడియో పనిచేస్తుందని వివరించారు స్టూడియో నిర్వాహకులు. ఇది కేవలం ప్రకటన మాత్రమేనని, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, సంస్థ పేరు, దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలను మే 4న ప్రకటిస్తామని తెలిపారు. ఈ ఎనౌన్స్‌మెంట్‌కి సంబంధించి ఒక వీడియోను కూడా సంస్థ విడుదల చేసింది.
![]() |
![]() |