![]() |
![]() |
.webp)
నిత్యమీనన్(Nithya menen)ప్రస్తుతం స్టార్ హీరో ధనుష్(Dhanush)తో కలిసి 'ఇడ్లీ కడై'(idly kadai)మూవీతో మరోసారి జత కడుతుంది.ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది.ఇంతకు ముందు ఈ ఇద్దరి కాంబోలో 'తిరు' మూవీ వచ్చి మంచి విజయాన్ని సాధించడంతో'ఇడ్లీ కడై' పై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి.తిరు మూవీలో అత్యుత్తమ నటన కనపర్చినందుకు గాను నిత్య మీనన్ జాతీయ అవార్డు కూడా గెలుచుకున్న విషయం తెలిసిందే.
రీసెంట్ గా నిత్య మీనన్ తన పర్సనల్ లైఫ్ తో పాటు సినీ జర్నీలో ఎదురైన కొన్ని సంఘటనల గురించి ప్రేక్షకులతో పంచుకుంది.ఆమె మాట్లాడుతు చాలా మంది నా ఫస్ట్ సినిమా చేస్తున్నప్పుడు నీ జుట్టు చాలా వింతగా ఉందేంటి అనే వారు.స్కూల్,కాలేజీ డేస్ నుంచే నా జుట్టుతో ఈ సమస్య ఉండేది.కానీ ఇప్పుడు అందరు నా రింగుల జట్టునే ఇష్టపడుతున్నారు.మీరు చాలా లావుగా,పొట్టిగా,కనుబొమ్మలు పెద్దవిగా ఉన్నాయని కూడా అనే వారు.ఆ మాటలు నాపై చాలా ప్రభావం చూపించాయి.పైగా అలాంటి సవాళ్లు వస్తేనే మనమేంటో నిరూపించుకునే అవకాశం వస్తుంది.ఎన్ని విమర్శలు ఎదురైనా నా రూపాన్ని మాత్రం మార్చుకోకుండా నేనేంటో నిరూపించుకోవాలని అనుకున్నాను.శారీరక రూపాన్ని బట్టి మనుషులని అంచనా వెయ్యకూడదని చెప్పుకొచ్చింది.
నిత్య మీనన్ ఈ ఏడాది జనవరిలో జయంరవితో (Jayam Ravi)కలిసి పొంగల్ కానుకగా 'కాదళీక్క నెరుమల్లై' తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ప్రస్తుతం ఆమె చేతిలో 'ఇడ్లికడై' తో పాటు విజయ్ సేతుపతి ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
![]() |
![]() |