![]() |
![]() |

సిద్దు జొన్నలగడ్డ(Siddhu JOnnalagadda)బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya)జంటగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ జాక్(Jack).బొమ్మరిల్లు భాస్కర్(BOmmarillu Bhaskar)దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్(Bvsn Prasad)బాపినీడు(Bapineedu) నిర్మించారు.ప్రచార చిత్రాలు బాగుండటంతో జాక్ పై అందరిలోను భారీ అంచనాలు ఉన్నాయి.పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో వెల్లడించిన అభిప్రాయాలు,రివ్యూల వివరాల్లోకి వెళితే..
జాక్ సినిమా చూసాం.ఫస్ట్ ఆఫ్ పర్లేదు.కానీ సెకండ్ ఆఫ్ మాత్రం బాగోలేదు.లాజిక్ లేని సీన్లు చాలా ఉన్నాయి.రా అంటే రాయల్‌గా చూపించాల్సింది పోయి రోతగా చూపించారు. కథపరంగా సరిగా వర్కవుట్ కాలేదు.కాకపోతే సిద్దు పెర్ఫార్మెన్స్ ఈ సినిమాను కాపాడింది.కాకపోతే బొమ్మరిల్లు జోనర్ లో కథ ఉండటం,కామెడీ సీన్లు, బీజీఎం పాజిటివ్ అంశాలు.వీఎఫ్ఎక్స్ వర్క్ బాగాలేకపోవడం వల్ల సీన్స్ ని ప్రేక్షకులు కనక్ట్ కాలేకపోతారు టోటల్ గా 'జాక్' సగం ఉడకని వంటలాగా ఉంది.బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ కూడా బాగోలేదు.ప్రతీ ఒక్క ఎమోషన్‌ను వాడుకుని చూపించాడు.
కాకపోతే అవేవీ కనెక్ట్ కావు.అన్ని కమర్షియల్ అంశాల్ని పొందుపర్చాలని అనుకున్నాడు.కానీ అందులో ఏ ఒక్క అంశం కూడా జనాలకు కనెక్ట్ కనెక్ట్ కాదు.గజిబిజిగా నడిచే భాస్కర్ స్క్రీన్ ప్లే కూడా మైనస్ అని పలువురు ట్విట్టర్ వేదికగా చెప్తున్నారు.
![]() |
![]() |