![]() |
![]() |

వరల్డ్ వైడ్ గా విశేష ఆదరణ సొంతం చేసుకున్న పలు థ్రిల్లర్ వెబ్ సిరీస్ లలో 'స్క్విడ్ గేమ్'(Squid Game)కూడా ఒకటి.దక్షిణ కొరియా డిస్టోపియన్ సర్వైవల్ థ్రిల్లర్ హర్రర్ టెలివిజన్ సిరీస్ గా ఈ సిరీస్ తెరకెక్కగా కొరియన్ రచయితతో టెలివిజన్ నిర్మాత హ్వాంగ్ డాంగ్ హ్యూక్ రూపొందించాడు. 2021 లో మొదటి సిరీస్,2024 సెకండ్ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యి ప్రపంచ మూవీ లవర్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది.2025 జూన్ 27 మూడో సిరీస్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతుండగా భారీ మొత్తంలో వచ్చే నగదు బహుమతి గెలుచుకోవడానికి 456 మంది వివిధ రకాల ఆటగాళ్లు తమ ప్రాణాలని పణంగా పెట్టి ఎలాంటి గేమ్స్ ఆడారనే పాయింట్ తో ఈ సిరీస్ తెరకెక్కింది.
ఈ సిరీస్ లో 456 మంది ఆటగాళ్ళల్లో ఒకడిగా నటించిన నటుడు ఓ యోంగ్ సు(O Yeong Su).80 సంవత్సరాల వయసు కలిగిన 'సు' సుమారు 50 సంవత్సరాల నుంచి నటుడిగా కొనసాగిస్తు వస్తున్నాడు.కొన్ని రోజుల క్రితం ఒక లేడీ జూనియర్ ఆర్టిస్ట్ పై లైంగిక వేధింపులకి పాల్పడగా . సదరు బాధితురాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.దీంతో ఆమె తరుపు లాయర్ కోర్టులో వాదిస్తు జూనియర్ ఆర్టిస్ట్ జీవనోపాధికి సినిమాలే ఆధారం.కానీ 'సు' వల్ల ఆమె షూటింగ్ లకి వెళ్ళడానికి భయపడుతుందని చెప్పుకొచ్చాడు.
దీంతో ఈ కేసుకి సంబంధించిన అన్ని వివరాలని పరిశీలించిన కోర్టు 'సు' కి ఏడాది పాటు జైలు శిక్ష విధించింది.విచారణ సమయంలో తను చేసిన పనికి 'సు'పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయకపోవడంతో పాటుగా తనని తాను సమర్ధించుకున్నట్టుగా తెలుస్తుంది.

![]() |
![]() |