![]() |
![]() |
.webp)
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)ప్రస్తుతం 'పెద్ది'(Peddi)మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.గ్రామీణ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ నేపథ్యంతో తెరకెక్కుతుండగా,ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు(Buchibabu)దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.రీసెంట్ గా 'పెద్ది'మూవీకి సంబంధించి చరణ్ ఫస్ట్ లుక్ రిలీజయ్యి యూట్యూబ్ లో రికార్డు వ్యూయర్స్ తో ముందుకు దూసుపోతుంది.రేపు ఏప్రిల్ 6 శ్రీరామనవమి సందర్భంగా గ్లింప్స్ కూడా రిలీజ్ కానుండటంతో మెగా అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొని ఉంది.
చరణ్ ఇటీవల్ మార్చి 27 న తన 40 వ పుట్టిన రోజుని ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే.తన పుట్టిన రోజు సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబుకి చరణ్ దంపతులు రీసెంట్ గా శ్రీరామచంద్రుడి పాదుకల్ని,హనుమాన్ ప్రతిమని,హనుమాన్ చాలీసా పుస్తకాన్ని గిఫ్ట్ గా పంపించారు.బుచ్చిబాబుని ఉద్దేశించి 'నా మనసులో నీకెప్పుడు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.హనుమాన్ ఆశీస్సులు ఎల్లప్పుడు నీపై ఉండాలని కోరుకుంటున్నానని ఒక నోట్ ని కూడా చరణ్ పంపించడం జరిగింది.ఆ ఫొటోల్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న బుచ్చిబాబు ఈ బహుమతి మీ ప్రేమని,అభిమానాన్ని తెలియచేస్తుందంటు చరణ్,ఉపాసన ని టాగ్ చేస్తు పోస్ట్ పెట్టాడు.
'పెద్ది'లో చరణ్ సరసన జాన్వీ కపూర్(Janhvi Kapoor)హీరోయిన్ గా చేస్తుండగా జగపతి బాబు,కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్,వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా ఏ ఆర్ రెహ్మాన్(Ar Rehman)సంగీతాన్ని అందిస్తున్నాడు.ఈ సంవత్సరమే పెద్ది థియేటర్స్ లో అడుగుపెట్టనుంది.

![]() |
![]() |