![]() |
![]() |

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)సతీమణి ఉపాసన కొణిదెల(Upasana konidela)పలు సామాజిక సమస్యలపై స్పందిస్తు సోషల్ మీడియా ద్వారా తన భావాన్నిప్రజలకి తెలియచేస్తు ఉంటుంది.జంతు,పక్షి ప్రేమికురాలు కూడా అయిన ఉపాసన అందుకు సంబంధించిన పలు రకాల వాటిని పెంచుతు ఉంటుంది.
గత రెండు రోజులుగా హైదరాబాద్(Hyderabad)కంచ గచ్చిబౌలి ఏరియాలో ఉన్న400 ఎకరాల భూములకి సంబంధించి ప్రభుత్వానికి,హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(Hcu)విద్యార్థుల మధ్య గొడవ జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ విషయంపై ఓవర్ నైట్ బుల్డోజర్స్,స్టూడెంట్ అరెస్ట్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏం జరుగుతుందనే విషయాన్నీ తన ఇనిస్టాగ్రమ్(Inistagram)ద్వారా షేర్ చేస్తు 'ఇది జరుగుతున్నట్లైతే కొత్తగా మళ్ళీ చెట్లు నాటతారా! యానిమల్స్,పక్షులకి కొత్త ప్లేస్ చూపిస్తారా! అనే క్యాప్షన్ ని జోడించింది.
![]() |
![]() |