![]() |
![]() |
.webp)
మెగాస్టార్ 'చిరంజీవి'(Chiranjeevi)తన 157వ చిత్రాన్ని'సంక్రాంతికి వస్తున్నాం' ఫేమ్ అనిల్ రావిపూడి(Anil Ravipudi)దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే.ఉగాది రోజు ఈ చిత్రం అధికారకంగా ప్రారంభం కాగా,బాలకృష్ణ(Balakrishna)తో భగవంత్ కేసరి ని నిర్మించి హిట్ ని అందుకున్న సాహు గారపాటి(sahu Garapati)చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల(Sushmita Konidela)సంయుక్తంగా నిర్మిస్తున్నారు.షూట్ కి వెళ్లక ముందే సంక్రాంతికి రిలీజ్ అని ప్రకటించారంటే మేకర్స్ ఎంత ప్లానింగ్ తో వెళ్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.
రీసెంట్ గా చిత్ర బృందం ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.మెగా 157కి పని చేస్తున్న ప్రధాన టెక్నీషియన్స్ ని చిరంజీవి గత చిత్రాలలోని స్టిల్స్ మధ్య ఉంచి ఆయా సినిమాల్లోని చిరు ఫేమస్ డైలాగ్స్ కి సింక్ అయ్యేలా వాళ్ళతో చెప్పించారు.చిరు కూడా వాళ్ళని పరిచయం చేసుకొని,తనదైన బాడీ లాంగ్వేజ్ తో వాళ్ళని ఎంకరేజ్ చేసాడు.ఆ విధంగా చిరు ఒక్కొక్కరిని పరిచయం చేసుకునే విధానం,ఆయన మాట్లాడిన మాటలు కూడా ఎంటర్ టైన్ మెంట్ కోణంలో సాగాయి.
చివరలో ఈ గ్యాంగ్ కి బాస్ ఎక్కడ అని చిరు అనగానే గ్యాంగ్ లీడర్ కట్ అవుట్ వెనక నుంచి అనిల్ రావిపూడి వచ్చి వచ్చే సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ ని రఫ్ ఆడించేద్దామ్ బాస్ అనడం ఇలా రెండు గంటల 40 నిమిషాల నిడివితో ఉన్న వీడియో ఆధ్యంతం అభిమానులతో పాటు ప్రేక్షకులని అలరిస్తుంది.భీమ్స్ సిసిరోలియా(Beems Sisirolio)సంగీతాన్ని అందిస్తుండగా సమీర్ రెడ్డి కెమెరా బాధ్యతలని నిర్వహిస్తున్నాడు.

![]() |
![]() |