![]() |
![]() |

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(MOhanlal)పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran)కాంబోలో ఈ నెల 27న పాన్ ఇండియా వైడ్ గా విడుదలైన ఎల్ 2 ఎంపురాన్ (l2 empuraan)ఇప్పటికే 100 కోట్ల క్లబ్ లో చేరి,మరిన్ని భారీ వసూళ్లు రాబట్టే దిశగా దూసుకెళ్తుంది.కాకపోతే కొన్ని వర్గాల వారి నుంచి మూవీలోని పలు సన్నివేశాలపై అభ్యంతరాలు రావడంతో మోహన్ లాల్ క్షమాపణలు చెప్పాడు.దర్శకుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ పై అయితే సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ విషయంపై పృథ్వీ రాజ్ సుకుమారన్ తల్లి మల్లిక సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు 'నా కుమారుడు ఎవరని మోసం చెయ్యడం గాని,ఎవరి వ్యక్తిగత నమ్మకాల్ని వ్యతిరేకించడం గాని చెయ్యలేదు.అందరి ఆమోదయోగ్యంతోనే మూవీ తెరకెక్కింది.రచయిత కూడా ఎప్పుడు పక్కనే ఉండేవాడు.అవసరమైతే డైలాగుల్లో మార్పులు కూడా చేసేవారు.మూవీలో ఏమైనా సమస్యలు ఉంటే,అందులో భాగమైన అందరకి బాధ్యత ఉంటుంది.మోహన్ లాల్ నాకు ఎప్పట్నుంచో తెలుసు.నా తమ్ముడితో సమానం.ఆయనతో పాటు నిర్మాతలెవరు తమని పృథ్వీ రాజ్ మోసం చేసాడని చెప్పలేదు.ఇప్పుడు వాళ్ళకి తెలియకుండా నా కుమారుడిని బలి పశువుని చెయ్యాలని చూస్తున్నారు.
ఈ వివాదంపై స్పందించాలని అనుకోలేదు.కానీ నా కుమారుడిపై తప్పుడు కథనాలు చూసి ఆవేదనతో స్పందిస్తున్నాను.ఈ సినిమా తెరకెక్కించడం కోసం నా కొడుకు చాలా కష్టపడ్డాడు.
మోహన్ లాల్ కి తెలియకుండా కొన్ని సన్నివేశాలు జోడించారంటూ వస్తున్న వార్తల్లో కూడా నిజం లేదని చెప్పుకొచ్చింది.అభ్యంతరాలు వస్తున్న సీన్స్ ని మార్చినట్టుగా తెలుస్తుంది.లైకా ప్రొడక్షన్స్,ఆశీర్వాద్ సినిమాస్,గోకులం మూవీస్ అత్యంత భారీ వ్యయంతో ఎల్ 2 ఎంపురాన్ ని నిర్మించాయి.
![]() |
![]() |