![]() |
![]() |
.webp)
తెలుగు సినీ పరిశ్రమలో రానా(Rana Daggubati)విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)లకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.సుదీర్ఘ కాలంగా అనేక చిత్రాల్లో నటిస్తు అభిమానులని అలరిస్తు వస్తున్నారు.విజయ్ దేవరకొండ తన అప్ కమింగ్ మూవీ 'కింగ్ డమ్'(KIngdom)లో బిజీగా ఉండగా,రానా నిర్మాతగా 'కాంత'(Kantha)అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.దుల్కర్ సల్మాన్,భాగ్యశ్రీ బోర్సే హీరో, హీరోయిన్ గా చేస్తున్నారు.దీంతో పాటు రానానాయుడు Season 2 కి సంబంధించిన టెలివిజన్ సిరీస్ చేస్తు బిజీగా ఉన్నాడు.
ఇప్పుడు ఈ ఇద్దరిపై బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నందుకు హైదరాబాద్ మియాపూర్ లో కేసు నమోదయ్యింది.ఈ ఇద్దరితో పాటు నిధి అగర్వాల్(Nidhhi Agerwal)ప్రకాష్ రాజ్,మంచులక్ష్మి, ప్రణీత,శ్రీముఖి,రీతూ చౌదరి,యాంకర్ శ్యామల,నీతూ అగర్వాల్,వర్షిణి,అనన్య నాగళ్ళ,విష్ణుప్రియ,సిరి హనుమంతు,వంశీ సౌందర్య రాజన్,వసంత కృష్ణ, శోభాశెట్టి, అమృత చౌదరి,నాయిని పావని,నేహా పతాన్ ,పాండు, పద్మావతి ,ఇమ్రాన్ ఖాన్,సాయి,భయ్యాసన్నీ,టేస్టీ తేజ,బండారు శేషసుకృతి ఇలా మొత్తం ఇరవై ఐదు మంది పై మియాపూర్ వాసి ప్రమోద్ శర్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసారు.

![]() |
![]() |