![]() |
![]() |

డబుల్ ఇస్మార్ట్ నిరాశపరచడంతో ఈ సారి ఎలాగైనా హిట్ ని అందుకోవాలనే పట్టుదలతో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram Pothineni)తన తదుపరి మూవీని మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి దర్శకుడు మహేష్(Mahesh)తో చేస్తున్న విషయం తెలిసిందే.భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse)హీరోయిన్ గా చేస్తుండగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers)అధినేతలు నవీన్,రవిశంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్నారు.ప్యూర్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో సాగర్ అనే లవర్ బాయ్ గా రామ్ ప్రచార చిత్రాలు ఒక లెవల్లో ఉండంటంతో,మూవీ కోసం ప్రేక్షకులు ఇప్పట్నుంచే ఎదురుచూస్తూ ఉన్నారు.
దాదాపు నెలరోజులపై నుంచి ఈ చిత్ర షూటింగ్ రాజమండ్రిలో జరుగుతు ఉంది.నాన్ స్టాప్‌గా డే అండ్ నైట్ జరిగిన ఈ షెడ్యూల్‌లో రెండు పాటలతో పాటు ఒక యాక్షన్ సీక్వెన్స్,కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ ని చిత్రీకరించడం జరిగింది.రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న అందమైన లొకేషన్లని అంతే అందంగా క్యాప్చర్ చేశామని చిత్ర బృందం అధికారంగా వెల్లడి చేసింది.ఈ షెడ్యూల్ లో రామ్,భాగ్యశ్రీ తో పాటు రావు రమేష్,మురళీశర్మ,సత్య,రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ తదితరులు పాల్గొన్నారు.ఈ నెల 28 నుంచి హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ మొదలవుతుందని కూడా మేకర్స్ వెల్లడి చెయ్యడం జరిగింది.
ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్(Srikar Prasad)సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ నూని,మ్యూజిక్: వివేక్,మెర్విన్, సీఈవో: చెర్రీ. రామ్ కెరీర్ లో ఇది 22 వ చిత్రం కాగా RAPO22 వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరుపుకుంటు ఉంది.

![]() |
![]() |