![]() |
![]() |
.webp)
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)కి చిత్ర పరిశ్రమతో ఉన్న అనుబంధం నాలుగు దశాబ్డల పైమాటే. తను ఎదగడమే కాకుండా తెలుగు సినిమా కూడా ఎదిగేలా చిరంజీవి సినీ జర్నీ కొనసాగింది.సామజిక సేవా పరంగాను బ్లడ్ అండ్ ఐ బ్యాంకుతో పాటు సినీ నటులు ఎవరైనా కష్టాల్లో ఉంటే తన వంతు సాయం చేస్తు పలువురుకి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
కొన్ని రోజుల క్రితం చిరంజీవికి యూకే గవర్నమెంట్ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.దీంతో యూకే(Uk)వెళ్లిన చిరంజీవి బ్రిటన్ కాలమాన ప్రకారం 19 రాత్రి ఆ అవార్డుని అందుకొని,ఆ ఘనత సాధించిన తొలి భారతీయ వ్యక్తిగా నిలిచాడు.దీంతో ఆయన అభిమానులతో పాటు తెలుగు వారందరు చిరంజీవి తెలుగువారందరికీ గర్వకారణంగా నిలిచాడంటు సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
సినిమాల పరంగా చూసుకుంటే చిరు ప్రస్తుతం విశ్వంభర(Vishwambhara)అనే సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నాడు.చిత్రీకరణ కూడా తుది దశలో ఉందనే వార్తలు వస్తున్నాయి.సంక్రాంతికి వస్తున్నాంఫేమ్ అనిల్ రావిపూడి(Anil ravipudi)డైరెక్షన్ లో కూడా ఒక మూవీ చేస్తుండగా త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.
![]() |
![]() |