![]() |
![]() |

మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. విష్ణు, మనోజ్ మధ్య కొంతకాలంగా వార్ నడుస్తోంది. ఈ వివాదంలో మోహన్ బాబు తన పెద్ద కుమారుడు విష్ణు పక్కన నిలబడ్డారు. దీంతో తండ్రికి, అన్నకి.. మనోజ్ దూరమైనట్టే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మార్చి 19న జరగనున్న మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలకు సైతం మనోజ్ కి ఆహ్వానం లేదనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో విష్ణుకి పోటీగా మనోజ్ బాక్సాఫీస్ వార్ కి దిగుతున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది. (Manchu Vishnu vs Manchu Manoj)
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందుతోన్న చిత్రం 'కన్నప్ప'. మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఇందులో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తుండటం విశేషం. విష్ణు 'కన్నప్ప'పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ముఖ్యంగా ప్రభాస్ బ్రాండ్ ఈ సినిమాకి కలిసొస్తుందని భావిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ 'కన్నప్ప' సినిమాకి పోటీగా మనోజ్ సినిమా విడుదలయ్యే అవకాశముందట. (Kannappa vs Bhairavam)

బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ తో కలిసి మనోజ్ నటిస్తున్న చిత్రం 'భైరవం'. తమిళ్ మూవీ 'గరుడన్'కి రీమేక్ గా రూపొందుతోన్న 'భైరవం'కి విజయ్ కనకమేడల దర్శకుడు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని కూడా ఏప్రిల్ 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. అదే జరిగితే, విష్ణు-మనోజ్ బాక్సాఫీస్ వార్ కి దిగినట్టు అవుతుంది.
ఓ వైపు 'కన్నప్ప' ఏమో విష్ణుకి డ్రీమ్ ప్రాజెక్ట్. మరోవైపు మనోజ్ ఏకంగా ఏడేళ్ల తర్వాత 'భైరవం'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇద్దరు సోదరులకు ఈ సినిమాల రిజల్ట్ కీలకం. అలాంటిది ఇద్దరూ ఒకరిపై ఒకరు పోరుకి సిద్ధమవుతున్నారనే న్యూస్ వినిపిస్తోంది. మరి ఈ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.
![]() |
![]() |