![]() |
![]() |

'లవ్ టుడే 'ఫేమ్ ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan)అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran)కయదు లోహర్(Kayadu Lohar)జంటగా ఫిబ్రవరి 21 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'(Return Of the dragon).ఆశ్వత్ మారిముత్తు(Ashwath Marimuthu)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తమిళనాట 'డ్రాగన్' గా విడుదలైంది.తెలుగు,తమిళ రెండు భాషల్లోను మంచి విజయాన్ని అందుకుని ప్రదీప్ రంగనాధన్ కెరీరి లో హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచింది.
ఇప్పుడు ఈ మూవీ ఓటిటి వేదికగా అడుగుపెట్టబోతుంది.మార్చి 21 నుంచి నెట్ ఫ్లిక్స్(Net Filx)లో తెలుగు,తమిళ,మలయాళ,కన్నడ,హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.గత కొన్ని రోజుల నుంచి డ్రాగన్ ఓటిటి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.దీంతో డ్రాగన్ ఎప్పుడెప్పుడు ఓటిటి లోకి వస్తుందా అని అన్ని భాషలకి చెందిన సినీ అభిమానులు ఎదురుచూస్తుఉన్నారు.ఈ నేపథ్యంలో తాజా వార్త వాళ్ళల్లో ఆనందాన్ని తీసుకొచ్చిందని చెప్పవచ్చు.
రాఘవన్ చిన్నప్పటి నుంచి చదువులో నెంబర్ వన్ స్టూడెంట్.ఒక అమ్మాయిని ప్రేమించి ఆ విషయాన్నీ ఆమెకి చెప్తాడు.కానీ ఆమె ఒక బ్యాడ్ బాయ్ ని ఇష్టపడటంతో రాఘవన్ తన పేరుని డ్రాగన్ గా మార్చుకొని బ్యాడ్ బాయ్ లాగా మారిపోయి ఇంజినీరింగ్ చదువుని నిర్లక్ష్యం చేస్తాడు.కానీ డ్రాగన్ బిహేవియర్ నచ్చి కీర్తి(అనుపమ పరమేశ్వరన్) డ్రాగన్ ని ప్రేమిస్తుంది.ఆ తర్వాత జీవితంలో బతకడానికి డ్రాగన్ కరెక్ట్ కాదని వేరే అతన్ని పెళ్లి చేసుకుంటుంది.కీర్తి హస్బెండ్ కంటే ఎక్కువ శాలరీ తీసుకోవాలని దొంగ సర్టిఫికెట్స్ తో సాఫ్ట్ వేర్ జాబ్ సంపాదించిన డ్రాగన్ అంచలంచలుగా ఎదుగుతాడు.ఒక గొప్పింటి కోటేశ్వరరాలు కూతురు పల్లవితో ఎంగేజ్ మెంట్ కూడా అవుతుంది.కాకపోతే కాలేజీ ప్రిన్సిపాల్ మోహన్ బాబుకి డ్రాగన్ దొంగ సర్టిఫికెట్ గురించి తెలుస్తుంది.దీంతో డ్రాగన్ తో నీ ఉద్యోగం పోకుండా ఉండాలంటే మళ్ళీ కాలేజీకి వచ్చి ఇంజనీరింగ్ లో మిగిలి ఉన్న క్యాట్ లాగ్స్ ని పూర్తి చెయ్యమని ఆదేశిస్తాడు.దీంతో డ్రాగన్ మళ్ళీ కాలేజీలో చేరి ఇంకో పక్క ఉద్యోగం కూడా చేస్తుంటాడు.చివరకి ఏమవుతుందనేది ఎవరు ఊహించని విధంగా కామెడీ జోనర్ లో మూవీ కొనసాగుతూ ఉంటుంది.మంచి మెసేజ్ ని కూడా ఈ మూవీ ఇచ్చింది.

![]() |
![]() |