![]() |
![]() |

బెట్టింగ్ యాప్స్ వల్ల డబ్బులు పోగొట్టుకొని, ఎందరో యువత ప్రాణాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో యువత జీవితాలను నాశనం చేసే ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్స్ పై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా హర్షసాయి, విష్ణుప్రియ, రీతు చౌదరి, శ్యామల, టేస్టీ తేజ, సుప్రీత, సన్నీ యాదవ్ సహా మొత్తం 11 మందిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్‌లకు దూరంగా ఉండాలని పిలుపునిస్తూ నటుడు సంపూర్ణేష్ బాబు ఒక వీడియో విడుదల చేశారు. (Sampoornesh Babu)
"ప్రస్తుతం యువత అన్ని రంగాల్లో ముందున్నారు. కానీ, కొంత మంది అడ్డదారులు తొక్కుతూ, తొక్కిస్తూ అనవసరమైన వ్యసనాలకు బానిసలవుతున్నారు. బెట్టింగ్ యాప్స్ ఎంతో మందిని ప్రభావితం చేస్తున్నాయి. ఈ బెట్టింగ్ యాప్స్ ఆడటం వల్ల డబ్బులు సంపాందించవచ్చని కొందరు, ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుందని మరికొందరు, ఎంటర్‌టైన్‌మెంట్ దొరుకుతుందని ఇంకొందరు మనకు మాయ మాటలు చెప్పి మనల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. వ్యసనం వల్ల బాగుపడ్డట్టుగా చరిత్రలో లేదు. దయచేసి ఈ బెట్టింగ్ యాప్‌లను డిలీట్ చేయండి. ఈ యాప్‌లకు దూరంగ ఉండండి. మిమ్మలను నమ్ముకున్న వాళ్ల కోసం, మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కోసం ఒకసారి ఆలోచించండి. ఇలాంటి యాప్‌లను ప్రమోట్ చేసే వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవడానికి మన ప్రభుత్వం, సజ్జనార్ సార్ సిద్ధంగా ఉన్నారు." అని సంపూర్ణేష్ బాబు తెలిపారు. (Say No To Betting Apps)
సమాజానికి తనకు తోచిన సహాయం చేయడంలో సంపూర్ణేష్ బాబు ఎప్పుడూ ముందుంటారు. ఇక ఇప్పుడు, యువత జీవితాలను నాశనం చేస్తున్న బెట్టింగ్ యాప్స్ కి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో సంపూర్ణేష్ తన గళం వినిపించడంపై ప్రశంసలు కురుస్తున్నాయి.
![]() |
![]() |