![]() |
![]() |

నితిన్(Nithiin)అప్ కమింగ్ మూవీ'రాబిన్ హుడ్'(Robin Hood).యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా,మార్చి 28 న వరల్డ్ వైడ్ గా విడుదల కావడానికి ముస్తాబు అవుతుంది.పుష్ప 2 తో రీసెంట్ గా పాన్ ఇండియా లెవల్లో హిట్ ని అందుకున్న మైత్రి మూవీస్(Mythri Movies)అధినేతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి లు నితిన్ కెరీరి లోనే ఫస్ట్ టైం 60 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించడంతో 'రాబిన్ హుడ్' పై అందరిలోను అంచనాలు హై లెవల్లో ఉన్నాయని చెప్పవచ్చు.ప్రచార చిత్రాలు కూడా అందుకు తగ్గట్టే ఉన్నాయి.శ్రీలీల(Sreeleela)హీరోయిన్ గా చేస్తుండగా వెంకీ కుడుమల(Venki Kudumula)దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు.
రీసెంట్ గా నితిన్ ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)లోని ఏలూరు(Eluru)జిల్లా బుట్టాయిగూడ మండలంలో ఉన్న మహిమాన్వితమైన 'శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి' (Gubbala Mangamma thalli)ఆలయాన్నిసందర్శించాడు.అక్కడి ఆచారాల ప్రకారం అమ్మవారిని దర్శించుకొని రాబిన్ హుడ్ హిట్ అవ్వాలని కోరుకోవడంతో పాటు,అమ్మవారి విశిష్టత గురించి కూడా నితిన్ అడిగి తెలుసుకున్నాడు.అనంతరం ఆలయ వంశపారంపర్య పూజారులు నితిన్ ని ఆశీర్వదించి తీర్ధ ప్రసాదాలు అందచేశారు.నితిన్ తో పాటు నిర్మాత రవిశంకర్,డైరెక్టర్ వెంకీ కుడుమల కూడా అమ్మవారిని దర్శించుకున్నారు.
నితిన్,వెంకీ కాంబోలో వచ్చిన భీష్మ నితిన్ వరుస పరాజయాలకి ముగింపు పలికింది.అదే విధంగా గత కొంత కాలంగా హిట్ లేని నితిన్ ని రాబిన్ హుడ్ హిట్ ట్రాక్ లోకి తీసుకొస్తుందని ఆయన అభిమానులు బలంగా నమ్ముతున్నారు.రాజేంద్రప్రసాద్(Rajendraprasad)షైన్ టామ్ చాకో,వెన్నెల కిషోర్,ఆడుకాలం నరేన్,మైమ్ గోపి తదితరులు కీలక పాత్రలు పోషించగా జివి ప్రకాష్ కుమార్(Gv Prakash Kumar)సంగీతాన్ని అందించాడు.

![]() |
![]() |