![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కథానాయకుడిగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'విశ్వంభర' (Vishwambhara). యు.వి. క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.
'విశ్వంభర' షూటింగ్ దాదాపు పూర్తయింది. ఒక్క ఐటెం సాంగ్ తప్ప షూటింగ్ పూర్తయిందని తెలుస్తోంది. ఏప్రిల్ లో ఈ ఐటెం సాంగ్ ని చిత్రీకరించనున్నారని సమాచారం.
ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న 'విశ్వంభర'లో పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయట. ఇప్పటికే మెగాస్టార్ ఇంట్రడక్షన్ సాంగ్ అదిరిపోయింది అనే టాక్ వచ్చింది. ఇక ఈ ఐటెం సాంగ్ కూడా సరికొత్తగా, ఒక ఊపు ఊపేలా ఉంటుందట.
సోషియో ఫాంటసీ ఫిల్మ్ అయినప్పటికీ మెగా అభిమానులు, మాస్ ప్రేక్షకులు మెచ్చే అంశాలు 'విశ్వంభర'లో పుష్కలంగా ఉంటాయట. ముఖ్యంగా అదిరిపోయే సాంగ్స్, మెగాస్టార్ స్టెప్పులతో.. మెగా ట్రీట్ ఉంటుందని అంటున్నారు.
'విశ్వంభర' సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తోంది. ఛోటా కె. నాయుడు కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్స్ గా కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్ కామిరెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఆగస్టు 22న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
![]() |
![]() |