![]() |
![]() |

'సవ్యసాచి' సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన నిధి అగర్వాల్.. 'ఇస్మార్ట్ శంకర్'తో కుర్రకారుకి బాగా దగ్గరైంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో 'హరి హర వీర మల్లు', ప్రభాస్ తో 'ది రాజా సాబ్' చేస్తోంది. రెండు భారీ సినిమాలు చేతిలో ఉండటంతో ఇతర సినిమాలు కమిట్ అవ్వట్లేదు నిధి. ఈ రెండు సినిమాల తర్వాత తన క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనేది ఆమె నమ్మకం. అందుకే నిధి 'హరి హర వీర మల్లు', 'రాజా సాబ్' విడుదల కోసం ఎంతగానో ఎదురుచూస్తోంది. ఇలాంటి తరుణంలో నిధి ఒక సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి అంగీకరించిందనే వార్త ఆసక్తికరంగా మారింది. (Nidhhi Agerwal)
సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'జాట్'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్.. ఏప్రిల్ 10న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ సినిమాలోని ప్రత్యేక గీతంలో నిధి అగర్వాల్ సందడి చేయనుందట. 'హరి హర వీర మల్లు', 'ది రాజా సాబ్' రిలీజ్ కోసం ఎంతో ఎదురుచూస్తూ ఇతర ప్రాజెక్ట్ లకు ఓకే చెప్పని నిధి.. ఇప్పుడు సడెన్ గా 'జాట్'లో ఐటెం సాంగ్ కి ఓకే చెప్పిందనే వార్త ఆశ్చర్యం కలిగిస్తోంది. మరి ఈ ఐటెం సాంగ్ తో నిధి ఏ రేంజ్ లో మాయ చేస్తుందో చూడాలి.
![]() |
![]() |