![]() |
![]() |

విశ్వక్ సేన్(Vishwak Sen)ఫస్ట్ టైం లేడీగెటప్ లో నటించగా ఫిబ్రవరి 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ లైలా(Laila).మొదటి ఆట నుంచే నెగిటివ్ టాక్ ని తెచ్చుకొని విశ్వక్ కెరీర్ లోనే భారీ డిజాస్టర్ గా నిల్చింది.బూతు డైలాగ్స్,బూతు సీన్స్ శృతిమించాయనే అపఖ్యాతిని కూడా మూటగట్టుకోవడంతో ఇకపై లైలా లాంటి సినిమాల్లో గాని,సన్నివేశాల్లో గాని నటించనని, విశ్వక్ సేన్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసాడు.తనని క్షమించమని కోరడం కూడా జరిగింది.
ఓటిటిలో'లైలా' అమెజాన్ ప్రైమ్(Amazon Prime)వీడియో వేదికగా మార్చి 9 నుంచి స్ట్రీమింగ్ అవుతుండగా,నెగిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది.కానీ ఇప్పుడు ఈ మూవీ తమిళ లాంగ్వేజ్ లో ఓటిటి వేదికగా స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం.మేకర్స్ కూడా ఎలాంటి ప్రకటన విడుదల చేయకుండా సైలెంట్ గా రిలీజ్ చేసారు.తెలుగులో ఆదరణ దక్కకపోయినా కూడా మేకర్స్ ధైర్యంతో తమిళ డబ్బింగ్‌లోకి కూడా అందుబాటులోకి తీసుకురావడం విశేషం.మరి తమిళ ప్రేక్షకులు ఎలాంటి ఆదరణ చూపిస్తారో చూడాలి.
ఆకాంక్ష శర్మ(Akansha Sharma)హీరోయిన్‌గా నటించగా అభిమన్యు సింగ్, పృథ్వీరాజ్ ముఖ్య పాత్రల్లో చేసారు.బాలకృష్ణ(Balakrishna)తో భగవంత్ కేసరి నిర్మించిన సాహు గారపాటి నిర్మాతగా వ్యవహరించగా రామ్ నారాయణ్(Ram narayan)దర్శకత్వం వహించాడు.లియోన్ జేమ్స్ సంగీత దర్శకుడు.
![]() |
![]() |