![]() |
![]() |
.webp)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ఫస్ట్ టైం చేస్తున్నచారిత్రాత్మక జానపద చిత్రం 'హరిహరవీరమల్లు'(Hari Hara Veeramallu).తెలంగాణ(Telangana) పోరాట యోధుడు 'పండగ సాయన్న'(Panduga Sayanna)జీవిత కథనే హరిహర వీరమల్లుగా తెరకెక్కిస్తున్నారనే ప్రచారం ఎప్పట్నుంచో ఉంది.టీజర్ తో పాటు ఇటీవల విడుదలైన రెండు సాంగ్స్ ఒక రేంజ్ లో ఉండటంతో పవన్ ఫ్యాన్స్ తో పాటు,ప్రేక్షకుల్లో 'వీరమల్లు'పై భారీ అంచనాలు ఉన్నాయి.
పాన్ ఇండియా లెవల్లో 'వీరమల్లు' మార్చి 28 న రిలీజ్ కాబోతుందనే విషయం అందరకి తెలిసిందే.చాలా రోజుల కిందటే మేకర్స్ ఈ విషయాన్నీ అధికారంగా వెల్లడి చేసారు.కానీ మార్చి 28 కి మూడు వారాల సమయం కూడా లేదు.పైగా తెలుగుతో పాటు, తమిళ,మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతుంది.ఇన్ని భాషల్లో రిలీజ్ కాబోతుందంటే, ఇప్పట్నుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టాలి.కానీ ఇంతవరకు 'వీరమల్లు' టీం నుంచి అలాంటి వాతావరణం కనిపించడంలేదు.దీంతో 'వీరమల్లు' మార్చి 28 నుంచి వాయిదా పడిందనే మాటలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.మరి ఈ విషయంపై మేకర్స్ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి. 'వీరమల్లు' రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
నటీనటుల విషయానికి వస్తే ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ 'నిధి అగర్వాల్'(Nidhhi Agerwal)పంచమి అనే రాజ నర్తకిగా కనపడబోతుంది.ప్రముఖ హిందీ నటుడు,అనిమల్ ఫేమ్ బాబీడియోల్(Bobby Deol)ఔరంగ జేబు గా మరోసారి 'వీరమల్లు' లో తన నట విశ్వ రూపాన్ని చూపించబోతున్నాడు.నాజర్,అనసూయ,నోరా ఫతేహి, జిష్ణుసేన్ గుప్తా, పూజిత పొన్నాడ, సునీల్, వంటి వారు ముఖ్యమైన క్యారక్టర్ లలో కనిపిస్తున్నారు.మెగా సూర్య ప్రొడక్షన్ పై ఏఎం రత్నం(A.m Rathnam)దయాకర్(Dayakar)లు 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించగా కీరవాణి(keeravani)సంగీతాన్ని అందించాడు.క్రిష్,(Krish)జ్యోతికృష్ణ(Jyothi Krishna)సంయుక్తంగా దర్శకత్వం వహించారు.
.webp)
![]() |
![]() |