![]() |
![]() |

'నువ్వొస్తానంటే నేనొద్దంటానా',బొమ్మరిల్లు,వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకుల అభిమాన హీరోగా మారిన తమిళ నటుడు సిద్దార్ధ(Siddharth)ఆ తర్వాత 'కొంచం ఇష్టం కొంచం కష్టం,ఓయ్,ఆట,మహాసముద్రం,చిన్నా,భారతీయుడు 2 వంటి పలు జోనర్స్ తో కూడిన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులని తన నటనతో అలరిస్తు వస్తున్నాడు.గత ఏడాది డిసెంబర్ లో ద్వీబాష చిత్రంగా తెరకెక్కిన 'మిస్ యు' తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.పలు తమిళ, హిందీ,మలయాళ చిత్రాల్లో కూడా నటించి తనకంటూ ఒక క్రేజ్ ని సృష్టించుకున్నాడు.
ప్రముఖ ఓటిటి ఛానల్ 'నెట్ ఫ్లిక్స్'(Netflix)భారత్(Bharath)పాకిస్థాన్(Pakisthan)మధ్య జరిగిన కార్గిల్ యుద్ధ నేపథ్యంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఒక వెబ్ సిరీస్ ని ప్లాన్ చేస్తుంది. ఇందులో సిద్దార్ధ్ ఒక ప్రధాన క్యారక్టర్ లో కనిపించబోతున్నాడు.'ఆపరేషన్ సఫెద్ సాగర్' పేరుతో తెరకెక్కబోయే ఈ వెబ్ సిరీస్ లో సిద్దార్ధ్ తో పాటు జిమ్మీ షెర్గిల్, అభయ్ వర్మ, మిహిర్ అహుజా వంటి మేటి నటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.కార్గిల్ యుద్ధంలో భారత వైమానిక దళం పాకిస్థాన్ ని ఎదుర్కోవడానికి ఎలాంటి వ్యూహాత్మక ఆలోచనలతో కదన రంగంలోకి దిగింది.భారత సైనికులు ఎలాంటి ధైర్య సాహసాలని ప్రదర్శించారు.దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల జీవితాలని కళ్ళకి కట్టినట్టు ఈ సిరీస్ లో చూపించనున్నారు.త్వరలోనే ఈ సిరిస్ పై నెట్ ఫ్లిక్స్ అధికార ప్రకటన కూడా విడుదల చేయనుందని వార్తలు వస్తున్నాయి.
భారత్, పాకిస్థాన్ మధ్య 1999 మే 3 న కార్గిల్ యుద్ధం(Kargil War)ప్రారంభమయ్యి రెండు నెలల మూడు వారాల రెండు రోజుల పాటు జరిగి జులై 26 తో ముగిసింది. పాకిస్తాన్ సైనికులు, కాశ్మీరీ తీవ్రవాదులు నియంత్రణ రేఖ దాటి భారతదేశంలోకి చొరబడడం వల్లే ఈ యుద్ధంజరిగింది.ఆ సమయంలో భారత వైమానిక దళం'ఆపరేషన్ సఫెద్ సాగర్'(Operation Safed Sagar)పేరుతో యుద్దానికి దిగి విజయాన్ని అందుకుంది.

![]() |
![]() |