![]() |
![]() |
.webp)
మంచు విష్ణు(Vishnu)కెరీర్ లోనే మోస్ట్ ప్రెస్టేజియస్ట్ మూవీ కన్నప్ప(kannappa).పరమేశ్వరుడి పరమ భక్తుడైన భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుండగా మోహన్ బాబు(Mohan Babu)ప్రభాస్(Prabhas),మోహన్ లాల్, అక్షయ్ కుమార్,శరత్ కుమార్ వంటి లెజండ్రీ యాక్టర్స్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.దీంతో కన్నప్ప పై అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి.
ఏప్రిల్ 10 న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుండగా,తాజాగా హిందీ టీజర్ లాంచ్ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతు కన్నప్ప మూవీ ప్రారంభమయ్యాక నాలో చాలా మార్పులు వచ్చాయి.ఉన్నతంగా ఆలోచిస్తున్నాను.ప్రభాస్,మోహన్ లాల్ ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డారు.ఈ తరంలో శివుడు అంటే మొదట గుర్తుకొచ్చేది అక్షయ్ కుమారే.అక్షయ్ గారి వల్ల నటనకి సంబంధించి చాలా విషయాలు నేర్చుకున్నాను మా నాన్న మోహన్ బాబు గారి వల్లే అక్షయ్ గారు శివుడుగా చేసారు.మోహన్ బాబు కొడుకుని అని చెప్పుకోవడానికి కూడా చాలా గర్వ పడతానని విష్ణు చెప్పుకొచ్చాడు.
ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా చేస్తున్న 'కన్నప్ప'కి మహాభారతం టీవీ సీరియల్ ఫేమ్ ముకేశ్ కుమార్ సింగ్(Mukesh Kumar singh)దర్శకుడు కాగా 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ,ఏవిఏ ఎంటర్ టైన్ మెంట్స్ పై మోహన్ బాబు, విష్ణు తమ కెరీర్లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మించారు.స్టీఫెన్ దేవసి(Stephen devessy)సంగీతాన్ని అందించగా కొన్ని రోజుల క్రితం విడుదలైన శివుడికి సంబంధించిన సాంగ్ రికార్డు వ్యూయర్స్ తో ముందుకు దూసుకుపోతుంది.

![]() |
![]() |