![]() |
![]() |

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన 'డాకు మహారాజ్'తో మరో బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు దర్శకుడు బాబీ కొల్లి. డాకు మహారాజ్ చిత్రం థియేటర్లలో అదిరిపోయే వసూళ్లు రాబట్టి, బాలకృష్ణ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలవడమే కాకుండా.. ఓటీటీలోనూ సంచలనాలు సృష్టిస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీ, గ్లోబల్ వైడ్ గా ట్రెండ్ అవుతోంది. దీంతో దర్శకుడిగా బాబీ పేరు మారుమోగిపోతోంది. అదే సమయంలో బాబీ నెక్స్ట్ సినిమా ఏంటి? ఏ హీరోతో చేస్తున్నాడు? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే 'డాకు మహారాజ్' దెబ్బకి.. బాబీ జాక్ పాట్ కొట్టినట్లు తెలుస్తోంది. (Bobby Kolli)
దర్శకుడు బాబీ కొల్లి తన తదుపరి చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో చేయబోతున్నట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో.. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమాని నిర్మించనుందట. బాబీ చెప్పిన కథకి హృతిక్ ఇంప్రెస్ అయ్యాడని, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని వినికిడి. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది అంటున్నారు.
హృతిక్ రోషన్ ప్రస్తుతం 'వార్-2' సినిమా చేస్తున్నాడు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో జూనియర్ ఎన్టీఆర్ కూడా నటిస్తుండటం విశేషం. భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ, ఆగస్టులో విడుదల కానుంది. 'వార్-2' షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఈ సినిమా పూర్తయ్యాక హృతిక్-బాబీ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముంది.
టాలీవుడ్ లో పలు కమర్షియల్ సక్సెస్ లు చూసిన బాబీకి స్టైలిష్ డైరెక్టర్ గా పేరుంది. ఇప్పుడు 'డాకు మహారాజ్' నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అవ్వడంతో.. బాబీ గురించి పాన్ ఇండియా వైడ్ గా తెలిసింది. ఇక తాను హృతిక్ తో చేయబోయే సినిమాతో సత్తా చాటితే మాత్రం.. ఒక్కసారిగా పాన్ ఇండియా రేస్ లోకి బాబీ వస్తాడు అనడంలో సందేహం లేదు.
![]() |
![]() |