![]() |
![]() |

భారతదేశం గర్వించదగ్గ నటుల్లో కమల్‌హాసన్ ఒకరు. ఎలాంటి క్యారెక్టర్ చేసినా తన నటనతో ఆ పాత్రకే వన్నె తెచ్చే సామర్థ్యం ఉన్న నటుడు. ఒక దశలో సౌత్‌లో ఎవర్‌గ్రీన్ హీరోగా పేరు తెచ్చుకొని తనకంటూ ఓ ప్రత్యేమైన ఇమేజ్‌ని ఏర్పరుచుకున్నారు. ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూ తనలోని నటుడికి మెరుగులు పెట్టే కమల్ అంటే ఇష్టపడనివారు ఉండరు. అలాంటి గొప్ప నటుడికి ఊహించని షాకే తగిలింది. ఇండియాలోని టాప్ డైరెక్టర్స్‌లో ఒకరుగా పేరు తెచ్చుకున్న శంకర్ వల్లే కమల్ కెరీర్‌కి ఈ పరిస్థితి వచ్చింది. ఇటీవలికాలంలో కమల్‌హాసన్ నటించి నిర్మించిన సినిమాలు రిలీజ్ సమయంలో ఎన్నో ఇబ్బందులకు గురి కావడం మనం చూస్తున్నాం. అయినప్పటికీ ఏదో విధంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.
శంకర్ వల్ల కమల్‌హాసన్‌కి కలిగిన ఇబ్బందులు ఏమిటంటే.. 28 సంవత్సరాల క్రితం కమల్‌హాసన్ ద్విపాత్రాభినయంలో శంకర్ రూపొందించిన ఇండియన్ సినిమా అప్పట్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అప్పటివరకు వచ్చిన సినిమాల కథలకు భిన్నంగా ఇండియన్ చిత్రాన్ని రూపొందించారు. టెక్నికల్‌గా కూడా ఆడియన్స్‌కి కొత్త ఎక్స్‌పీరియన్స్‌నిచ్చిన సినిమా అది. అలాగే ఎ.ఆర్.రెహమాన్ సంగీత సారధ్యంలో రూపొందిన పాటలన్నీ పెద్ద హిట్ అయ్యాయి. ఒకవిధంగా చెప్పాలంటే ఇండియన్ అనేది ఒక ట్రెండ్ సెట్టర్ మూవీ. ఈ సినిమా తెలుగులో భారతీయుడుగా, హిందీలో హిందుస్థానీగా రిలీజ్ అయింది. దేశవ్యాప్తంగా ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత శంకర్ విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ దర్శకుడుగా టాప్ పొజిషన్‌కి వచ్చేశాడు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా శంకర్‌కి సరైన హిట్ లేదు.
అలాంటి క్రిటికల్ పొజిషన్‌లో ఇండియన్2 చిత్రాన్ని ఎనౌన్స్ చేశారు. మొదట ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాత. సినిమా ఎనౌన్స్ చేసిన నెలరోజుల్లోనే దిల్‌రాజు ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. అప్పుడు లైకా ప్రొడక్షన్స్ ఎంటర్ అయింది. ఉదయనిధి స్టాలిన్ మరో నిర్మాతగా వ్యవహరించారు. 2019లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఐదేళ్ళపాటు నిర్మాణ దశలోనే ఉన్న ఇండియన్ 2 చిత్రాన్ని 2024 జూలై 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. ఈ సినిమా చివరలో ఇండియన్3 చిత్రానికి సంబంధించిన 5 నిమిషాల ట్రైలర్‌ను కూడా థియేటర్లలో ప్రదర్శించారు. ఇండియన్3 లో విషయం ఉంది అని ప్రతి ఒక్కరూ అనుకున్నారు. ఇండియన్ 2 నిర్మాణ సమయంలోనే పార్ట్ 3కి సంబంధించి 50 శాతం షూటింగ్‌ని పూర్తి చేశారు. బ్యాలెన్స్ షూటింగ్ కూడా పూర్తి చేసి 2025లో ఇండియన్3ని విడుదల చెయ్యాలని ప్లాన్ చేశారు. కానీ, ఈలోగా కమల్‌హాసన్‌కి, శంకర్‌కి లైకా ప్రొడక్షన్స్ పెద్ద షాక్ ఇచ్చిందని తెలుస్తోంది. ఇండియన్3 నుంచి ఆ సంస్థ తప్పుకుందనే ప్రచారం జరుగుతోంది. రెడ్ జెయింట్ మూవీస్ అధినేత ఉదయనిధి స్టాలిన్ బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేసేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తోంది. మరి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మణిరత్నం డైరెక్షన్‌లో రూపొందుతున్న థగ్‌లైఫ్ చిత్రంలో నటిస్తున్నారు కమల్. ఈ సినిమా పూర్తి కాగానే ఇండియన్3 సెట్స్‌కి వెళతారని తెలుస్తోంది.
![]() |
![]() |