![]() |
![]() |

బాలీవుడ్ సీనియర్ నటీమణి షబానా అజ్మీ(Shabana Azmi)జ్యోతిక(Jyothika)అర్జున్ రెడ్డి(Arjun Reddy)ఫేమ్ షాలిని పాండే(Shalini Pandey)నిమేష సజయన్,సాయి తమహాంకర్, గజరాజ్ రావ్,జిష్ణు సేన్ గుప్తా(Jishnu sen Guptha)ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ 'డబ్బా కార్టెల్'(Dabba cartel).ఎక్సెల్ మీడియా ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై హీతిష్ భాటియా(Hitesh Bhatia)దర్శకత్వంలో ఈ సిరీస్ రూపొందగా ఈ నెల 28 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
రీసెంట్ గా ఈ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది.ట్రైలర్ లో కథ ఎలా ఉండబోతుందో చాలా క్లియర్ గా మేకర్స్ చెప్పేసారు.మధ్య తరగతికి చెందిన ఐదుగురు మహిళలు డబ్బా సర్వీసు ముసుగులో డ్రగ్స్ ని సరఫరా చేస్తుంటారు.ఆ తర్వాత దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నారనే పాయింట్ ఆధారంగా ఈ సిరీస్ రూపొందిందనే విషయం అర్ధమవుతుంది.నటీనటుల పెర్ఫార్మెన్స్ కూడా ఒక రేంజ్ లో ఉంది.డైలాగ్స్ కూడా ఆలోచింపచేసే విధంగా ఉన్నాయి.వివిధ భాషలకి చెందిన నటులు ఇందులో నటిస్తుండం వల్ల ఈ సిరీస్ పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకులని అలరించడం ఖాయమనే మాటలు సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.

![]() |
![]() |