![]() |
![]() |
.webp)
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)గత సంవత్సరం 'దేవర'(Devara)తో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్న విషయం తెలిసిందే.ఇక దేవర తర్వాత ఎన్టీఆర్ లిస్ట్ లో వార్ 2 ,ప్రశాంత్ నీల్
తో తెరకెక్కబోయే మూవీ,దేవర పార్ట్ 2 ఉన్నాయి.వీటిల్లో వార్ 2 ముందుగా ప్రేక్షకుల ముందుకు రానుండగా, ప్రశాంత్ నీల్ మూవీలో ఎన్టీఆర్ మార్చి నుంచి షూటింగ్ లో పాల్గొనబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి.
ఎన్టీఆర్ తన 'ఇనిస్టా స్టోరీస్' లో రీసెంట్ గా విడుదలైన 'బ్రహ్మ ఆనందం'(Brahma anandham)మూవీని ఉద్దేశించి పోస్ట్ చేస్తు 'బ్రహ్మా ఆనందం'మూవీ గురించి చాలా పాజిటివ్ విషయాలు వినిపిస్తున్నాయి.రాజా గౌతమ్,బ్రహ్మానందం గారికి,ఎంటైర్ 'బ్రహ్మ ఆనందం' టీం కి నా హృదయ పూర్వక అభినందనలని పోస్ట్ చెయ్యడం జరిగింది.ఎన్టీఆర్ చేసిన ఈ పోస్ట్ 'బ్రహ్మ ఆనందం' మూవీ ప్రేక్షకులకి మరింత రీచ్ అయ్యే అవకాశం ఉందనే మాటలు సినీ సర్కిల్స్ లో వినపడుతున్నాయి.
ఇక బ్రహ్మఆనందం మూవీ ఫిబ్రవరి 7 న విడుదల అవ్వగా నిజ జీవితంలో తండ్రి కొడుకులైన బ్రహ్మానందం(Brahmanandam),రాజా గౌతమ్(Raja Gowtham)లు ఈ మూవీలో తాత మనవళ్లుగా నటించారు.వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల,ప్రియా,సంపత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
.webp)
![]() |
![]() |