![]() |
![]() |

స్టార్ హీరో 'విజయ్ దేవరకొండ'(VIjay Devarakonda)స్టార్ డైరెక్టర్ 'పూరి జగన్నాధ్'(Purijagannadh)కాంబోలో తెరకెక్కిన మూవీ 'లైగర్'.(Laiger)2022 లో పాన్ ఇండియా మూవీగా విడుదలైన 'లైగర్' బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ ని చవి చూసింది.150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా 60 కోట్లు మాత్రమే వసూలు చేసిందంటే 'లైగర్' తాలూకు పరాజయం ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు.ఇక ఈ మూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ 'అనన్య పాండే' నటించింది.అనన్య పాండే ఎవరో కాదు బాలీవుడ్ లో ఎన్నో గొప్ప చిత్రాల్లో అత్యధ్బుతమైన క్యారక్టర్ ని పోషించి,అశేష ప్రేక్షాభిమానాన్ని పొందినప్రముఖ బాలీవుడ్ అగ్రనటుడు'చుంకీ పాండే'(Chunky Panday)కూతురు.
రీసెంట్ గా చుంకీ పాండే ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు నా కూతురు 'అనన్య' కి 'లైగర్' మూవీలో చెయ్యడం అసలు ఇష్టం లేదు. మూవీలోని క్యారక్టర్ కి అసలు సూట్ కానని,పైగా చిన్న పిల్లలా ఉంటానని నాతో చెప్పింది.కానీ నేను మాత్రం పెద్ద ప్రాజెక్టు కదా,సక్సెస్ అయితే మంచి పేరు వస్తుంది చెయ్యమని చెప్పాను.కానీ మూవీ రిలీజ్ అయ్యాక, అనన్య చెప్పిందే నిజమయ్యింది.తను పోషించిన క్యారక్టర్ కి చాలా యంగ్ గా అనిపించింది.ప్రేక్షకులు,విమర్శకులు కూడా ఇదే చెప్పారు.ఇక ఆ తర్వాత తనకి ఎప్పుడు సినిమాలకి సంబంధించిన సలహాలు ఇవ్వలేదు.మంచి ప్రాజెక్ట్స్ ని సెలక్ట్ చేసుకుంటూ కెరీర్ లో ముందుకు వెళ్తుంది.
అనన్య కూడా గతంలో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో 'లైగర్' గురించి మాట్లాడుతు 'లైగర్' మూవీని కరణ్ జోహార్, నా తండ్రి ఒత్తిడితోనే చేశాను.నా ప్రతి సినిమాకి అమ్మ రివ్యూ ఇస్తుంటుంది.లైగర్ చూసి జస్ట్ ఫర్ ఫన్ అంటు రిప్లై ఇచ్చింది.నా జీవితంలో అతి చెత్త రివ్యూ అదే అని చెప్పుకొచ్చింది.

![]() |
![]() |