![]() |
![]() |

తెలుగులో 'మహానటి', 'సీతారామం', 'లక్కీ భాస్కర్' సినిమాలతో మెప్పించి హ్యాట్రిక్ సాధించిన మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan).. మరో వైవిద్యభరితమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. అదే 'ఆకాశంలో ఒక తార'. లైట్ బాక్స్ మీడియా బ్యానర్‌పై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్న ఈ చిత్రానికి పవన్ సాదినేని దర్శకుడు. ప్రముఖ నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా ఈ చిత్ర నిర్మాణంలో భాగమయ్యాయి. (Aakasamlo Oka Tara)
'ఆకాశంలో ఒక తార' ఆదివారం నాడు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వనీదత్ వంటి వారు హాజరయ్యారు. ముహూర్తం షాట్‌కు అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, అశ్వనీదత్ కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి గుణ్ణం గంగరాజు దర్శకత్వం వహించారు.

'ఆకాశంలో ఒక తార' చిత్రానికి సినిమాటోగ్రఫర్‌గా సుజిత్ సారంగ్, ప్రొడక్షన్ డిజైనర్‌గా శ్వేత సాబు సిరిల్ పని చేయనున్నారు. ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ గా తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.
![]() |
![]() |