![]() |
![]() |
.webp)
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్(Varalaxmi Sarathkumar)కి తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.రచయితలు,దర్శకులు ఆమె కోసమే క్యారక్టర్లు క్రియేట్ చేసేంత రేంజ్ కి కూడా ఎదిగిందంటే ఆమె నటనకి ఉన్న పవర్ ని అర్ధం చేసుకోవచ్చు.ప్రస్తుతం ఇళయ దళపతి విజయ్(Vijay),హెచ్.వినోద్(H.Vinoth)ల కాంబోలో తెరకెక్కుతున్న 'జన నాయగన్'(Jana Nayagan)లో కీలక పాత్రలో చేస్తుంది.
రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూ లో తన పర్సనల్ విషయాల గురించి మాట్లాడుతు'పెళ్లి గురించి నేను ఎప్పుడు ఆలోచంచలేదు.అసలు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యం కూడా ఉండేది కాదు.ఎందుకంటే వివాహం అనేది నాకు సెట్ కాదనేది నా ఒపీనియన్.కానీ కాలానుగుణంగా నికోలయ్(Nicholai sachdev)తో పరిచయం ఏర్పడింది,దాంతో అతనే నాకు సరైన భాగస్వామి అనిపించి వివాహం చేసుకున్నాను.
కొంత మంది పెళ్లి తర్వాత నా లైఫ్ మారిందని అనుకున్నారు.వాళ్లకి నేను చెప్పేది ఒక్కటే.పెళ్లి తర్వాత నా భర్త నికోలయ్ జీవితం మారింది తప్ప నా జీవితం ఏం మారలేదు.పెళ్లి తర్వాత నికోలయ్ నా కోసం హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యాడు.తన పేరు వెనుక నా పేరుని చేర్చుకున్నాడని చెప్పుకొచ్చింది.వరలక్మిశరత్ కుమార్, నికోలయ్ లు గత సంవత్సరం వివాహ బంధంతో ఒక్కటయ్యిన విషయం తెలిసిందే.
![]() |
![]() |