![]() |
![]() |

మెగా మేనల్లుడు 'సాయిధరమ్ తేజ్'(Sai Dharam Tej)తన పేరులో తల్లి పేరు కలిసేలా 'సాయి దుర్గాతేజ్'(Sai durgha tej)గా మార్చుకున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం 'సంబరాల ఏటి గట్టు'(Sambarala Yeti Gattu)అనే ఒక యాక్షన్ డ్రామా మూవీ చేస్తున్నాడు.కొన్ని రోజుల క్రితం తన పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ఆ మూవీ టీజర్ ఒక రేంజ్ లో ఉండటంతో పాటు,మూవీ కోసం ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఎదురుచూసేలా చేసిందని చెప్పవచ్చు.ప్రస్తుతం సంబరాల ఏటి గట్టు షూటింగ్ దశలో ఉంది.
ఇక రీసెంట్ గా తేజ్ తన ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేసాడు.ఆ పోస్ట్ లో 'ఒక వ్యక్తికి లివర్‌కు సంబంధించిన ఆపరేషన్ జరుగుతుంది.నా వంతుగా సాయం అందించాను.సదరు వ్యక్తికి వీలైన సాయం చేయండి. ఆ వ్యక్తికి అపోలో హాస్పిటల్‌లో చికిత్సను అందిస్తున్నారని తెలిపాడు.ఆ వ్యకికి సంబంధించిన ఇతర వివరాలను కూడా తన ట్వీట్‌లో వెల్లడి చెయ్యడం జరిగింది.తేజ్ ఇలాంటి విషయాలపై తనకి తోచిన సాయం చెయ్యడమే కాకుండా ప్రజల్లో కూడా ఇలాంటి విషయాలపై ఎ వేర్ నెస్ తీసుకొస్తు ఉంటాడు.
పుట్టిన రోజున అనవసరపు ఆర్భాటాలు వద్దంటూ,ఆ డబ్బుతో ఎవరికైనా సాయం చేయండని అభిమానుల్ని,ప్రజలని కోరుతుండే తేజ్ విజయవాడలో ఉన్న ఒక ఓల్డేజ్ హోం నిర్వహణ బాధ్యతలన్నీ చూసుకుంటాడన్న విషయం తెలిసిందే.
![]() |
![]() |