![]() |
![]() |

సంక్రాంతి సందర్భంగా థియేటర్స్ తో పాటు,ఓటిటి వేదికగా పలు రకాల చిత్రాలు,వెబ్ సిరీస్ లు సందడి చేసిన విషయం తెలిసిందే.ప్రేక్షకులు కూడా అందుకు తగ్గట్టుగానే ఆయా చిత్రాల ద్వారా సినీ వినోదాన్ని ఆస్వాదించారని చెప్పవచ్చు.ఈ వారం కూడా ప్రేక్షకులకి ఏ మాత్రం వినోదం తగ్గకుండా పలు చిత్రాలు సందడి చేయనున్నాయి.
తమిళ స్టార్ హీరో విశాల్(Vishal)సంక్రాంతికి 'మదగజరాజ'(Madha gaja raja)అనే మూవీతో తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.విశాల్ సరసన అంజలి,వరలక్ష్మిశరత్ కుమార్ హీరోయిన్లుగా చేసిన ఈ మూవీకి సుందర్(Sundhar)దర్శకుడు.ఇప్పుడు ఈ మూవీ తెలుగులో ఈ నెల 31 న విడుదల కాబోతుంది.మదగజరాజ పేరుతోనే విడుదల అవుతున్న ఈ చిత్రాన్నిసత్యకృష్ణ ప్రొడక్షన్స్
విడుదల చేస్తుంది.గతంలో విశాల్ నటించిన చాలా చిత్రాలు తెలుగులోలో ప్రేక్షకాదరణ పొందిన విషయం తెలిసిందే.ఇక రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma)దర్శకత్వంలో వచ్చిన 'డేంజరస్' అనే చిత్రం ద్వారా పరిచయమైన హీరోయిన్ అప్సర రాణి.ఇప్పడు 'రాచరికం'తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ నెల 31 న విడుదల కానుండగా వరుణ్ సందేశ్,విజయ్ శంకర్ వంటి నటులు ప్రధాన పాత్రలు పోషించారు.ట్రైలర్,ప్రచార చిత్రాలైతే మూవీ మీద ఆసక్తిని కలగచేస్తున్నాయి,సురేష్ లంకపల్లి(Suresh Lakalapally)దర్శకుడిగా వ్యవహరించాడు. 'మహిష' అనే మరో మూవీ కూడా ఈ నెల 31 నే ప్రేక్షకుల ముందుకు రానుంది.కె వీ ప్రవీణ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కగా యషిక, పృథ్వీరాజ్, వైష్ణవి ప్రధాన పాత్రలు పోషించారు.
ఓటిటిలో చూసుకుంటే 'ఐడెంటిటీ' అనే మలయాళ మిస్టరీ థ్రిల్లరీ 31 నుంచి జీ 5 లో స్ట్రీమింగ్ కానుంది.తెలుగుతో పాటు ఇతర భాషల్లోను రిలీజ్ అవుతున్న ఈ మూవీ,ఈ నెల 24 న థియేటర్స్ లోకి అడుగుపెట్టింది.ఇప్పుడు వారానికే ఓటిటి లోకి అడుగుపెట్టడం గమనార్హం. త్రిష,టోవినో థామస్,అఖిల్ పాల్,అనాస్ ఖాన్ వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు.ఇక 'పోతుగడ్డ' అనే మరో మూవీ థియేటర్ రిలీజ్ కాకుండా డైరెక్ట్ గా ఈటీవీ విన్ లో 30 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.పృథ్వీ,విస్మయశ్రీ,ఆడుకాలం నరేన్,శత్రు కీలక పాత్రల్లో నటించారు.
హాలీవుడ్ కి సంబంధించి నెట్ ఫ్లిక్స్ లో జనవరి 31 న
'లుక్కాస్ వరల్డ్'
'ది స్నో గర్ల్స్ 2 ' అనే వెబ్ సిరీస్
అమెజాన్ ప్రైమ్ లో
27 న 'ట్రెబ్యునల్ జస్టిస్' అనే వెబ్ సిరీస్,
30 న 'బ్రీచ్', 'ఫ్రైడే నైట్ లైట్స్
జియోలో చూసుకుంటే
28 న 'ది స్టోరీ టెల్లర్' అనే హిందీ చిత్రం
ఆపిల్ టీవీ ప్లస్ లో 29 నుంచి 'మిదెక్ క్వెస్ట్' అనే హాలీవుడ్ మూవీ,
సోనీ లైవ్ లో ఫిబ్రవరి 1 ఉంచి 'సాలె ఆషిక్' అనే హిందీ మూవీ ప్రేక్షకులని అలరించడానికి వస్తున్నాయి.
![]() |
![]() |