![]() |
![]() |

నట ప్రపూర్ణ డాక్టర్ మోహన్ బాబు హీరోగా చేసిన పలు హిట్ మూవీస్ లో దొంగ పోలీస్ కూడా ఒకటి.1992 లో వచ్చిన ఈ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులని అలరించిన హీరోయిన్ మమతకులకర్ణి.ప్రశాంత్ హీరోగా తెరకెక్కిన ప్రేమ శిఖరం లోను అత్యుత్తమ నటనని కనపర్చి అభిమాన గణాన్ని కూడా సంపాదించుకుంది.
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో ప్రతి పన్నెండేళ్ల కొకసారి జరిగే మహా కుంభ మేళ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే.ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఈ మహా కుంభ మేళాకు హాజరవుతున్నారు.మమతా కులకర్ణి కూడా వెళ్లడం జరిగింది.అంతే కాకుండా ఆమె ఈ కుంభ మేళాలో సన్యాసం తీసుకుని గిరి సాధ్విగా తన పేరుని మార్చుకుంది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు కుంభ మేళాకు రావడం చాలా సంతోషంగా ఉండటంతో పాటు, సన్యాసం స్వీకరించడం తన అదృష్టమని తెలిపింది.పలు బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించిన మమతా కులకర్ణి వయసు 52 సంవత్సరాలు.ప్రస్తుతం ఆమె సన్యాసిగా మారిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతవరకు ఆమె వివాహం చేసుకోలేదు.
![]() |
![]() |