![]() |
![]() |
.webp)
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా(Priyanka chopra)కి భారతీయ సినీ ప్రేమికుల్లో ఉన్న క్రేజ్ గురించి అందరకి తెలిసిందే.ప్రపంచ సుందరి కిరీటాన్ని కూడా దక్కించుకున్న ప్రియాంక 'తమిళన్' అనే తమిళ చిత్రం ద్వారా సినీ అరంగ్రేటం చేసింది.ఆ తర్వాత హిందీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది.హాలీవుడ్ లో కూడా పలు చిత్రాలతో పాటు,పలు వెబ్ సిరీస్ లో చేసిన ప్రియాంక తెలుగులో కూడా రామ్ చరణ్ తో తుఫాన్ అనే మూవీలో చేసింది.
ఆమె నిన్న రంగారెడ్డి జిల్లాలో ఉన్న సుప్రసిద్ధ శ్రీ చిలుకూరు బాలాజీని దర్శించుకుంది. ఆలయ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్ ప్రియాంకకి దగ్గరుండి స్వామి వారి దర్శనం చేయించడంతో పాటు,ఆలయం యొక్క విశిష్టిత గురించి వివరించాడు.అనంతరం తీర్ధ ప్రసాదాలని అందించారు.ప్రియాంక ప్రస్తుతం మహేష్ బాబు(Mahesh Babu)రాజమౌళి(Rajamouli)కాంబోలో తెరకెక్కబోతున్న ssmb 29 లో హీరోయిన్ గా చేస్తుందనే వార్తలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఆమె స్వామి వారి ఆశీస్సులు తీసుకోవడానికే వచ్చినట్టుగా తెలుస్తుంది.
.webp)
![]() |
![]() |