![]() |
![]() |
మంచు మోహన్‌బాబు ఫ్యామిలీలోని వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా తాను కష్టపడి నిర్మించుకున్న భవనాల్లో మనోజ్, అతని భార్య ఉంటున్నారని, వాళ్లని ఖాళీ చేయించి తనకు స్వాధీనం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు మోహన్‌బాబు. జల్‌పల్లిలోని రెండు భవనాల్లో మనోజ్ ఫ్యామిలీ ఉంటోందని ఈ సందర్భంగా తెలిపారు. ఇదిలా ఉంటే.. తాజాగా మంచు మనోజ్ మీడియాతో మాట్లాడారు.
‘నా పోరాటం జస్టిస్ కోసమే. ఇంటికి రానివ్వడం లేదని ఆరోపణలు చేస్తున్నారు. ఇది వినడానికి కామెడీగా ఉంది. నేను అలా ఎందుకు అంటాను. విద్యానికేతన్‌లో స్టూడెంట్స్ తరఫున మాట్లాడుతున్నాను. అందుకే ఇలాంటి ఎలిగేషన్స్ వస్తున్నాయి. ఇక్కడి మారుమూల గ్రామాల్లో వారితో ఏవేవో సంతకాలు తీసుకుంటున్నారు, డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. హాస్టల్స్ కోసం లోన్స్ రెయిజ్ చేసుకుంటున్నారు. ఇదంతా ఏమిటో నాకు అర్థం కావడంలేదు. క్యాంపస్ డెవలప్ చేయడంలో అందరి కాంట్రిబ్యూషన్ ఉంది. అక్క, అన్న కాంట్రిబ్యూషన్, నా కాంట్రిబ్యూషన్, మా బంధువుల కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. 200 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు. ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తోంది. ఇవన్నీ నేను అడుగుతున్న ప్రశ్నలు. లక్ష్మీప్రసన్న పిక్చర్స్‌లో, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీలో నేను 10, 12 సినిమాలు చేశాను. ఏరోజైనా ఒక్క రూపాయి తీసుకున్నానా. మా నాన్నగారిని నేను ఎప్పుడూ వ్యతిరేకించను. మా అన్న.. మా నాన్నగారిని ముందుకు తోసి వెనకుండి ఆడుతున్న నాటకం. మీరు డైరెక్ట్‌గా రండి మాట్లాడుకుందాం అని చెప్తూనే ఉన్నాను. ఇంతకంటే నేను ఏం చెప్పను. అలాగే జల్‌పల్లిలో మేం నివాసం ఉంటున్న భవనాల్లోంచి మమ్మల్ని ఖాళీ చేయించాలని కలెక్టర్‌గారిని అప్రోచ్ అయ్యారని తెలిసింది. అలా ఎందుకు జరిగిందో.. ఆ వివరాలేమిటో మీకు తర్వాత తెలియజేస్తాను’ అన్నారు మంచు మనోజ్
![]() |
![]() |