![]() |
![]() |

దివి నుంచి భువికి దిగివచ్చిన కారణజన్ముడువిశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు(Ntr).నూటికి నూరుపాళ్లు కారణ జన్ముడు అని చెప్పుకోవడానికి తెలుగు నేలపై ఆయన సృష్టించిన ప్రభంజనమే అందుకు సజీవ సాక్ష్యం.యుగ పురుషుడుగా ప్రజల గుండెల్లో దేవుడుగా కొలువుతీరి ఉంటడంతో పాటు,ఎంతో మందికి ఆదర్శప్రాయంగా కూడా నిలిచాడు.ఈ రోజు ఆయన 29 వ వర్ధంతి.
ఈ సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు ఆయన కుమారుడు బాలకృష్ణ(Balakrishna)మనవడు జూనియర్ ఎన్టీఆర్(Ntr)తో పాటు కళ్యాణ్ రామ్,ఇతర కుటుంబ సభ్యులు చేరుకొని నివాళులు అర్పించారు.ఈ సందర్భగా బాలకృష్ణ మాట్లాడుతూ నటనలో ప్రయోగాలు చేసిన నట ప్రావీణ్యుడు ఎన్టీఆర్.తెలుగుదేశం పార్టీని స్థాపించి పేద,బడుగుబలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి జీవితాల్లో వెలుగు నింపారు.ఆయన ఒక వర్సిటీ.జాతికి మార్గదర్శం.ఎన్టీఆర్ కి మరణం లేదు, తెలుగు వారి గుండెల్లో ఎప్పుడు సజీవంగా ఉంటారు.ఎంతో మందికి రాజకీయ భవిష్యత్తు ని ప్రసాదించి పాలనలో నూతన ఒరవడిని సృష్టించారని చెప్పుకొచ్చాడు.
![]() |
![]() |