![]() |
![]() |

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram charan)డ్యూయల్ రోల్ పోషించగా స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar)దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’(Game changer)ఈ నెల 10 న వరల్డ్ వైడ్ గా విడుదలైన విషయం తెలిసిందే.పొలిటికల్ కదాంశంతో తెరకెక్కిన ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 300 కోట్ల భారీ బడ్జెట్ తో దిల్ రాజు(Dil Raju)నిర్మించడం జరిగింది.
'గేమ్ చేంజర్' విడుదలైన కొన్ని గంటల్లోనే ఏపీ లోకల్ టీవీలో ప్రసారమయ్యింది. ఎండి అప్పలరాజు నేతృత్వంలో పైరసీ చేసి ప్రదర్శిస్తున్నారు.దీనిపై గేమ్ చేంజర్ చిత్ర బృందం ఆగ్రహాన్ని వ్యక్తం చేసి విశాఖపట్టణం కమీషనర్‌కు ఫిర్యాదు చెయ్యడం జరిగింది.దీంతో గాజువాక పోలీస్ అండ్ క్రైమ్ క్లూస్ టీమ్ ఏపీ లోకల్ టీవీపై దాడులు నిర్వహించింది. గేమ్ ఛేంజర్ మూవీని పైరసీ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చెయ్యడంతో పాటుగా అన్ని పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.ఎఫ్ఐఆర్ 22 / 2025) కింద నమోదు చేసి అరెస్టు చేశారు
ఇక గేమ్ చేంజర్ లో చరణ్ తండ్రి కొడుకులుగా నటించగా కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా చేసారు.శ్రీకాంత్,సముద్ర ఖని,ఎస్ జె సూర్య,సునీల్, రాజీవ్ కనకాల తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు..థమన్ సంగీతాన్ని అందించాడు.
![]() |
![]() |